IPL 2025 : భారీ ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్‌కు పెద్ద షాక్. తన తొలి ఓవర్లోనే మహ్మద్ షమీ డేంజరస్ ఎడెన్ మర్క్రమ్(1)ను వెనక్కి పంపాడు. మిడాఫ్ దిశగా మర్క్రమ్ ఆడిన బంతిని అక్కడే కాచుకొని ఉన్న కమిన్స్ ఒడిసి పట్టుకున్నాడు. దాంతో, 4 పరుగుల వద్ద లక్నో మొదటి వికెట్ పడింది. ప్రస్తుతం మిచెల్ మార్ష్(7), నికోలస్ పూరన్(1)లు క్రీజులో ఉన్నారు. 2 ఓవర్లకు లక్నో స్కోర్..14/1.
ఐపీఎల్ రికార్డు బ్రేకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేసింది. తమ సొంత ఇలాకాలో అభిమానులు అనుకున్నట్టుగా 200 ప్లస్ మాత్రం కొట్టలేదు కానీ, ప్రత్యర్థి లక్నో సూపర్ జెయింట్స్‌కు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది. శుభారంభం దక్కకపోయినా ఓపెనర్ ట్రావిస్ హెడ్(47), నితీశ్ కుమార్ రెడ్డి(32)లు దూకుడుగా ఆడారు. కుర్రాడు అనికిత్ వర్మ(36)మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(18) హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో. నిర్ణీత హైదరాబాద్ ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది.
Onto our bowlers now 🫡#PlayWithFire | #SRHvLSG | #TATAIPL2025 pic.twitter.com/UOA8HPqMzt
— SunRisers Hyderabad (@SunRisers) March 27, 2025