Suicide | ముషీరాబాద్, మార్చి 27: అత్తింటి వేధింపులు భరించలేక నవవధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం భోలక్‌పూర్ నివాసి సౌజన్య(26)కు మూసాపేట్‌కు చెందిన జిమ్ నిర్వాహకుడు శబరీష్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.
కాగా సౌజన్య గుండెకు రంధ్రం ఉందన్న విషయం తెలియడంతో భర్తతోపాటు, అత్తవారింటికి వారు వేధింపులకు గురి చేశారు. అత్తింటి వారి వేధింపులు భరించలేక సౌజన్య గురువారం పుట్టింటికి వచ్చి.. భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.