IPL 2025 : హిట్టర్లతో నిండిన లక్నో సూపర్ జెయింట్స్(LSG) పెద్ద స్కోర్ చేయలేకపోయింది. పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(3-43) విజృంభణతో ఆది నుంచి తడబడుతూ సాగింది. పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయిన జట్టును నికోలస్ పూరన్(44), ఆయుష్ బదొని(41)లు ఆదుకున్నారు. పంజాబ్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటూ లక్నో స్కోర్‌బోర్డును ఉరికించారు. అర్థ సెంచరీకి ముందు పూరన్ ఔటైనా.. అబ్దుల్ సమద్(27)తో కలిసి బదొని సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, పంత్ సేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది.
టాస్ ఓడిన లక్నోకు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆదిలోనే షాకిచ్చాడు. ఇన్నింగ్స్ నాలుగో బంతికే డేంజరస్ మిచెల్ మార్ష్(0)ను ఊరించే బంతితో పెవిలియన్ పంపాడు. మార్ష్ ఔటయ్యాక ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(28) ధాటిగా ఆడాడు. వరుసగా బౌండరీలతో చెలరేగిన అతడిని ఫెర్గూసన్ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. అంతే.. 32 కే వికెట్లు.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్(2)ను మ్యాక్స్‌వెల్ బోల్తా కొట్టించాడు. 35-3తో పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును పూరన్ ఆదుకున్నాడు. డేవిడ్ మిల్లర్(19), అయుష్ బదొని(41)తో కలిసి జట్టు స్కోర్ 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
Power 🤝 Improvisation = Batting brilliance 🔝
Abdul Samad bringing the big hits to give #LSG a strong finish 💥
Updates ▶ https://t.co/j3IRkQFrAa #TATAIPL | #LSGvPBKS | @LucknowIPL pic.twitter.com/a5phAWibfz
— IndianPremierLeague (@IPL) April 1, 2025
అర్థ శతకానికి చేరువైన పూరన్‌ను చాహల్ వెనక్కి పంపి లక్నో కష్టాలను మరింత పెంచాడు. అయితే.. బదొని సాధికారక ఇన్నింగ్స్ ఆడాడు. అబ్దుల్ సమద్(27)తో కలిసి 47 పరుగులు జోడించాడు. ఎడాపెడా బౌండరీలతో చెలరేగి వీళ్లిద్దరు జట్టు స్కోర్ 150 దాటించారు. వీళ్ల విధ్వంసంతో లక్నో 180 ప్లస్ కొట్టడం ఖాయమనిపించింది. కానీ, 20 ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయడంతో లక్నో7 వికెట్ల నష్టానికి 171కే పరిమితమైంది.