IPL 2025 : సొంతమైదానంలో లక్నో సూపర్ జెయింట్స్(LSG) టాపార్డర్ చేతులెత్తేసింది. పంజాబ్ కింగ్స్ పేసర్ల విజృంభణతో పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడుతున్న నికోలస్ పూరన్(44) సైతం 12వ ఓవర్లో వెనుదిరిగాడు. యజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో పూర్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద కాచుకొని ఉన్న మ్యాక్స్వెల్ ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 89 వద్ద లక్నో 4వ వికెట్ పడింది. ప్రస్తుతం ఆయుష్ బదొని(22), డేవిడ్ మిల్లర్(2)లు క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లకు స్కోర్.. 101-4.
టాస్ ఓడిన లక్నోకు పంజాబ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఆదిలోనే షాకిచ్చాడు. నాలుగో బంతికే డేంజరస్ మిచెల్ మార్ష్(0)ను పెవిలియన్ పంపాడు. మార్ష్ ఔటైనా నికోలస్ పూరన్(44) అండగా ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(28) ధాటిగా ఆడాడు. వరుసగా బౌండరీలతో చెలరేగిన అతడిని ఫెర్గూసన్ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. ఆ కాసేపటికే కెప్టెన్ రిషభ్ పంత్(2)ను మ్యాక్స్వెల్ బోల్తా కొట్టించాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును పూరన్ ఆదుకునే ప్రయత్నం చేసినా.. చాహల్ అతడిని వెనక్కి పంపి లక్నో కష్టాలను మరింత పెంచాడు.
#PBKS bowlers understood the assignment 😎
A superb start by @PunjabKingsIPL sees #LSG at 39/3 after 6 overs ☝#TATAIPL | #LSGvPBKS pic.twitter.com/Hbnkc7eeQ2
— IndianPremierLeague (@IPL) April 1, 2025