HCU | కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిధిలోని 400 ఎకరాల భూముల్లో పర్యావరణ విధ్వంసానికి తెగబడుతున్న రేవంత్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం అగ్గి రాజేస్తున్న నేపథ్యంలో.. పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.
కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్, పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్, విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల, యాంకర్ రష్మీ గౌతమ్, ఈషా రెబ్బా,ప్రియదర్శి తదితరులు స్పందిస్తున్నారు. తాజాగా ప్రకాశ్ రాజ్ కూడా స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజకీయ విశ్లేషకుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ వివాదంపై తనదైన శైలిలో స్పందిస్తూ.. విద్యాసంస్థలకు కేటాయించిన భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం అన్యాయంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. పశు పక్షాదులని అన్యాన్యంగా హింసించడం తగదు అంటూ రష్మీ గౌతమ్ పేర్కొంది.
రేణూ దేశాయ్ కూడా ప్రకృతిని పాడు చేయోద్దు అనేలా పోస్ట్ చేసింది. హెచ్సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూములను ఇతర ప్రయోజనాల కోసం వినియోగించాలన్న రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, మేధావులు, పౌర సమాజం, రాజకీయ పార్టీలు, సినీ సెలబ్రిటీలు అందరు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హెచ్సీయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కూడా భూముల రక్షణ కోసం విస్తృతంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ వివాదంపై రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రొఫెసర్లు, మేధావులు కూడా విద్యార్థులకు మద్దతు ఇస్తున్నారు. విద్యార్థులు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఎలాంటి కార్యచరణ అమలు చేయాలని రేవంత్ రెడ్డి సమావేశం కాగా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.