INDW vs SAW : సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో భారత మహిళళ జట్టు పంజా విసిరింది. బౌలింగ్ యూనిట్ అద్భతుంగా రాణించడంతో దక్షిణాఫ్రికాకు దడ పుట్టించింది. పూజా వస్త్రాకర్(413), రాధా యాదవ్(36)లు కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేయగా పర్యాటక జట్టును హర్మన్‌ప్రీత్ సేన 84 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం స్వల్ప ఛేదనలో ఓపెనర్ స్మృతి మంధాన(54 నాటౌట్) హాఫ్ సెంచరీతో కదం తొక్కగా 10 వికెట్ల విజయం సాధించింది. షఫాలీ వర్మ(27 నాటౌట్) సైతం దంచేయడంతో భారత జట్టు 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సఫారీలపై భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఇరుజట్లు 1-1తో సిరీస్ పంచుకున్నాయి.
సొంతగడ్డపై భారత మహిళల జట్టు మరోసారి అబ్బురపరిచే ప్రదర్శన చేసింది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించి దక్షణాఫ్రికా సిరీస్ ఆశలపై నీళ్లు చల్లింది. గత రెండు మ్యాచుల్లో చిదంబరం స్టేడియంలో తడబడిన హర్మన్‌ప్రీత్ సేన ఆఖరి టీ20లో అదరగొట్టింది . ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ (4/13), రాధా యాదవ్(3/6)లు బంతితో చెలరేగిన వేళ సఫారీలను తొలుత 84 పరుగులకే కట్టడి చేసింది.
Two solid strokes courtesy #TeamIndia openers!
Follow the match ▶️ https://t.co/NpEloo68KO#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/7WDzuZBhyX
— BCCI Women (@BCCIWomen) July 9, 2024
అనంతరం చిన్న లక్ష్య ఛేదనలో ఓపెనర్లు స్మృతి మంధాన(54 నాటౌట్), షఫాలీ వర్మ()లు ధాటిగా ఆడారు. తొలి ఓవర్ నుంచే దక్షిణాఫ్రికా బౌలర్లుపై ఎదురు దాడికి దిగారు. డస్సీ పడిపోయిన పర్యాటక జట్టు బౌలర్లను ఉతికేస్తే ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఇక డి క్లెర్క్ వేసిన 11 వ ఓవర్లో రెచ్చిపోయిన మంధాన.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో జట్టును గెలిపించడమే కాకుండా ఫీఫ్టీ పూర్తి చేసుకుంది. దాంతో ఇరుజట్లు 1-1తో సిరీస్ పంచుకున్నాయి.
𝙎𝙩𝙮𝙡𝙞𝙨𝙝 𝙀𝙣𝙙𝙞𝙣𝙜 ft. @mandhana_smriti 👌
Vice Captain brings up her 5️⃣0️⃣* with a maximum as #TeamIndia win by 10 wickets
Scorecard ▶️ https://t.co/NpEloo6GAm#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/o3Cmnh9cN6
— BCCI Women (@BCCIWomen) July 9, 2024
టాస్ ఓడిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ లారా వొల్వార్డ్త్(9)ను ఔట్ చేసిన శ్రేయాంక పాటిల్ ఇండియాకు బ్రేకిచ్చింది. ఆ తర్వాత డేంజరస్ మరిజానే కాప్(10)ను పూజా వస్త్రాకర్ బౌన్సర్‌తో బోల్తా కొట్టించింది. దాంతో, 30 పరుగులకే పర్యాటక జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
What a catch! 👌👌
Captain @ImHarmanpreet with a splendid fielding effort to dismiss Tazmin Brits 👏👏@Deepti_Sharma06 strikes ⚡️⚡️
Follow the match ▶️ https://t.co/NpEloo68KO#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/uW9sp32q66
— BCCI Women (@BCCIWomen) July 9, 2024
అనంతరం తంజిమ్ బ్రిట్స్(20), ఎలెనె బొస్చ్(0)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. కానీ, దీప్తి శర్మ తన తొలి ఓవర్లోనే తంజిమ్ వికెట్ తీసి సఫారీలను మరింత ఒత్తిడిలోకి తోసేసింది. ఇక ఆ తర్వాత 11వ ఓవర్లో పూజా రెండు వికెట్లు తీసి లారా బృందాన్ని ఆలౌట్ ప్రమాదంలోకి నెట్టింది. రాధా యాదవ్, అరుంధతి రెడ్డిలు టెయిలెండర్ల పని పట్టారు. 16. వద్ద దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.