Ricky Ponting | ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా పాంటింగ్‌కు మరో చాన్స్..!
Ricky Ponting : ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) చెత్త ప్రదర్శనతో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే. దాంతో, జట్టు ఎంపిక, బ్యాటింగ్ తీరుపై హెడ్‌కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్‌పై వేటు తప్పదని, ఢిల్లీ జట్టుతో పాంటింగ్‌కు ఇదే ఆఖరి సీజన్ అనుకున్నారంతా. కానీ, అనుభవజ్ఞుడైన అతడిపై ఢిల్లీ యాజమాన్యం నమ్మకం ఉంచింది. మరోసారి అతడికి....
Ricky Ponting : ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) చెత్త ప్రదర్శనతో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే. దాంతో, జట్టు ఎంపిక, బ్యాటింగ్ తీరుపై హెడ్‌కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఇక ఈ ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్‌పై వేటు తప్పదని, ఢిల్లీ జట్టుతో పాంటింగ్‌కు ఇదే ఆఖరి సీజన్ అనుకున్నారంతా. కానీ, అనుభవజ్ఞుడైన అతడిపై ఢిల్లీ యాజమాన్యం నమ్మకం ఉంచింది. మరోసారి అతడికి అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది. ఈ విషయాన్ని జెఎస్డబ్ల్యూ కో- ఓనర్ పార్త్ జిందాల్(Parth Jindal) ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
‘సౌరభ్ గంగూలీ, రికీ పాంటింగ్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సన్నాహకాలు జరుగుతున్నాయి. కిరణ్‌తో కలిసి ఫ్రాంచైజీని మళ్లీ టాప్ టీమ్‌గా నిలిపేందుకు చేయాల్సినదంతా చేస్తున్నా’ అని ట్వీట్లో జిందాల్ రాసుకొచ్చాడు. దాంతో, వచ్చే సీజన్లో పాంటింగ్ హెడ్‌కోచ్‌గా సేవలందించనున్నాడని అతను చెప్పేశాడు.
Preparations for next years @IPL are underway here @DelhiCapitals , along side @SGanguly99 and @RickyPonting we assure the fans that Kiran and I are working hard to get back to where we want this franchise to be and that is right at the very top.
— Parth Jindal (@ParthJindal11) June 14, 2023
ఆసీస్‌కు మూడు వరల్డ్ కప్‌లు అందించిన పాంటింగ్ ఢిల్లీని 14, 15 సీజన్లో అద్భుతంగా నడిపించాడు. రిషభ్ పంత్(Rishabh Pant) కెప్టెన్సీలో ఢిల్లీ 14 సీజన్లో ఫైనల్‌కు చేరింది. అయితే.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దాంతో, 16వ సీజన్లో కప్పు కొట్టాలనుకున్న ఆ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ పంత్ కారు యాక్సిడెంట్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

కొత్త కెప్టెన్ డేవిడ్ వార్నర్(David Warner), ఫిలిఫ్ సాల్ట్ తప్ప మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 15వ సీజన్లో దంచికొట్టిన విధ్వంసక ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) తీవ్రంగా నిరాశపరిచాడు. 8 మ్యాచుల్లో కొట్టిన అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు. వార్నర్ ఒంటరి పోరాటం చేసినా మిగతావాళ్ల నుంచి సహకారం కరువవ్వడంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముందే తప్పుకుంది.
ఇవి కూడా చదవండి
Michael Vaughan | వాళ్లది బ్రేకులు లేని ఫెరారీ కారు.. ఆసీస్‌కు ఇక కష్టమే : మైఖేల్ వాన్
Indonesian Open | సింధుకు షాకిచ్చిన వరల్డ్ నంబర్ 3.. రెండో రౌండ్లోనే వెనుదిరిగిన భారత షట్లర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

