Road accident : కర్ణాటకలో ముందు వెళ్తున్న కారును తప్పించబోయి ఓ బస్సు ఫ్లైవోవర్ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. అయినా వేగం అదుపులోకి రాకపోవడంతో అవతలి లైన్‌లోని మరో ఫ్లైవోవర్ పైకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా ఆరుగురికి గాయాలయ్యాయి. కర్ణాటకలోని కర్ణాటక-తుమకూరు రహదారికి సమీపంలోని ఫ్లవోవర్పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. కారును తప్పించపోయి ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను గుద్దిన బస్సు
కర్ణాటక – తుమకూరు రోడ్డు సమీపంలో ఫ్లైఓవర్ పై వెళ్తున్న కారును తప్పించపోయి పక్కనే ఉన్న రెయిలింగ్‌ను గుద్ది మరో ఫ్లైఓవర్ పైకి దూసుకు పోయున బస్సు.
ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఆరుగురు గాయపడ్డారు. pic.twitter.com/KNJAtndQXL
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2024