Michael Vaughan | వాళ్లది బ్రేకులు లేని ఫెరారీ కారు.. ఆసీస్‌కు ఇక కష్టమే : మైఖేల్ వాన్
Michael Vaughan : మరికొన్ని గంటల్లో యాషెస్ సిరీస్(Ashes Series) మొదలవ్వనుంది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా తొలి టెస్టు జరగనుంది. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్( Michael Vaughan) తొలి టెస్టుకు ముందు మాటల తూటాలు పేల్చాడు. 'ఇంగ్లండ్ ఆటగాళ్లు ఫెరారీ(Ferrari) కారు లాంటివాళ్లు. అయితే.. ఆ కారుకు....
Michael Vaughan : మరికొన్ని గంటల్లో యాషెస్ సిరీస్(Ashes Series) మొదలవ్వనుంది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా తొలి టెస్టు జరగనుంది. యాషెస్ అంటేనే.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల హోరాహోరీ పోరాటమే కాకుండా ఆటగాళ్ల మధ్య కవ్వింపులు, స్లెడ్జింగ్ గుర్తుకొస్తాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్( Michael Vaughan) తొలి టెస్టుకు ముందు మాటల తూటాలు పేల్చాడు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అతను ఈసారి ఆస్ట్రేలియాను హెచ్చరించాడు. ఇంగ్లండ్ జట్టు ఈ మధ్య అలవర్చుకున్న బాజ్‌బాల్(Bazz ball) ఆట తీరును అతను కొనియాడాడు.
‘ఇంగ్లండ్ ఆటగాళ్లు ఫెరారీ(Ferrari) కారు లాంటివాళ్లు. అయితే.. ఆ కారుకు బ్రేకులు లేవు. వాళ్లని ఎదుర్కోవడం చాలా చాలా కష్టం’ అని మైఖేల్ వాన్ అన్నాడు. ఐదేళ్లు (2003 నుంచి 2008) ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా ఉన్నవాన్ తమ జట్టును వేగంగా దూసుకెళ్లే ఫెరారీ కారుతో పోల్చడానికి ఓ కారణం ఉంది. గత రెండేళ్ల నుంచి ఆ జట్టు అద్భుతంగా ఆడుతోంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum) హెడ్ కోచ్‌గా వచ్చాక ఇంగ్లండ్ గేమ్ స్టయిల్ మారిపోయింది. బాజ్‌బాల్ ఆటతో వరుస సిరీస్‌లు గెలిచింది. ఇప్పటివరకు ఆడిన 17 టెస్టుల్లో 12 మ్యాచుల్లో బెన్ స్టోక్స్ బృందం విజయం సాధించింది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ రేపటితో షురూ కానుంది. 2021లో ఆసీస్ సొంత గడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించి, సిరీస్ సొంతం చేసుకుంది. దాంతో, ఆ ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
ఆస్ట్రేలియా జట్టు

ఆసీస్‌దే పై చేయి
యాషెస్ సిరీస్ 1882లో మొదలైంది. తొలి సిరీస్‌లో ఇంగ్లండ్ సంచలన ఆటతో విజేతగా నిలిచింది. అయితే.. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఇంగ్లండ్ 32 సార్లు, ఆస్ట్రేలియా 34 సార్లు ఈ సిరీస్ గెలిచాయి. రికార్డులు చూస్తే ఆసీస్‌దే పైచేయి. మరి ఇప్పుడు విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే..? ఇరు జట్లలోని ప్రధాన ఆటగాళ్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బాజ్‌బాల్(Bazz ball) ఆటతో ప్రత్యర్థులకు వణుకుపుట్టిస్తున్న ఇంగ్లండ్ యాషెస్‌లో అదే తరహాలో ఆడనుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే మా ఆట తీరును మార్చుకోమని కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఇంతకుముందే తేల్చి చెప్పాడు.
ఇవి కూడా చదవండి
Indonesian Open | సింధుకు షాకిచ్చిన వరల్డ్ నంబర్ 3.. రెండో రౌండ్లోనే వెనుదిరిగిన భారత షట్లర్
Ashes Series : రేపే యాషెస్ టెస్టు సమరం.. ఈసారి పైచేయి ఎవరిదో..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

