Indonesian Open | సింధుకు షాకిచ్చిన వరల్డ్ నంబర్ 3.. రెండో రౌండ్లోనే వెనుదిరిగిన భారత షట్లర్
Indonesian Open : ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో అయినా పతకం గెలవాలనుకున్న తెలుగు తేజం పీవీ సింధు(PV Sindhu)కు షాక్ తగిలింది. రెండో రౌండ్లోనే ఆమె ఇంటిదారి పట్టింది. వరల్డ్ నంబర్ 3 థాయ్ జూ యింగ్(Tai Tzu Ying, చైనీస్ తైపీ) చేతిలో సింధు....
Indonesian Open : ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో అయినా పతకం గెలవాలనుకున్న తెలుగు తేజం పీవీ సింధు(PV Sindhu)కు షాక్ తగిలింది. రెండో రౌండ్లోనే ఆమె ఇంటిదారి పట్టింది. వరల్డ్ నంబర్ 3 థాయ్ జూ యింగ్(Tai Tzu Ying, చైనీస్ తైపీ) చేతిలో సింధు ఓటమిపాలైంది. థాయ్18-21, 16-21తో జూ వరుస సెట్లలో విజయం సాధించింది. సింధుపై ఆమెకు ఇది వరుసగా తొమ్మిదో విజయం.
మ్యాచ్ ఆరంభం నుంచే సింధు తడబడింది. థాయ్ జూ యింగ్ స్ట్రాటజిక్ పాయింట్లతో దూకుడు కనబరిచి వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. ఆ తర్వాత పుంజుకున్న సింధు రెండు పాయింట్లు తెచ్చుకుంది. అయితే.. సింధుపై మెరుగైన రికార్డు ఉన్న ఈ చైనీస్‌తైపీ క్రీడాకారిణి ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. ఆమె జోరు ముందు భారత షట్లర్ నిలవలేకపోయింది. ఎంతో ప్రయత్నించినా ఒక్క సెట్ కూడా గెలవలేకపోయింది. ఈ ఏడాది ఒలింపిక్ విజేత సింధుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది టోర్నమెంట్లలో కేవలం ఏడింటిలోనే ఆమె రెండో రౌండ్ దాటింది. మలేషియా మాస్టర్స్(Malasia Master), థాయ్‌లాండ్ ఓపెన్(Thailand Open) టోర్నీల్లోనే సింధు అభిమానులను నిరాశపరిచింది.
ఇవి కూడా చదవండి
Ashes Series : రేపే యాషెస్ టెస్టు సమరం.. ఈసారి పైచేయి ఎవరిదో..?
Asia Cup 2023: హైబ్రిడ్ మోడల్లో ఆసియాకప్.. పాక్ వేదికగా 4 మ్యాచ్‌లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

