Ashes Series : రేపే యాషెస్ టెస్టు సమరం.. ఈసారి పైచేయి ఎవరిదో..?
Ashes Series : టెస్టు క్రికెట్లోని ఆసక్తికర పోరాటల్లో యాషెస్ సిరీస్(Ashes Series) ఒకటి. ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్(England) జట్లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే ఈ సిరీస్‌కు రేపటితో తెరలేవనుంది. రెండేళ్లకు ఓసారి జరిగే ఈ టెస్టు సమరానికి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తోంది. గత సిరీస్‌లో కంగారుల చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. రేపు ఎడ్జ్‌బాస్టన్(Edgbaston)స్టేడియంలో తొలి టెస్టు....
Ashes Series : టెస్టు క్రికెట్లోని ఆసక్తికర పోరాటల్లో యాషెస్ సిరీస్(Ashes Series) ఒకటి. ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్(England) జట్లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే ఈ సిరీస్‌కు రేపటితో తెరలేవనుంది. రెండేళ్లకు ఓసారి జరిగే ఈ టెస్టు సమరానికి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తోంది. గత సిరీస్‌లో కంగారుల చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిషిప్ ఫైనల్లో(WTC Final 2023) అద్భుత విజయంతో ప్యాట్ కమిన్స్ సేన ఆత్మవిశ్వాసంతో ఉంది. రేపు ఎడ్జ్‌బాస్టన్(Edgbaston)స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈసారి పైచేయి ఎవరిదంటే..?
యాషెస్ సిరీస్ 1882లో మొదలైంది. తొలి సిరీస్‌లో ఇంగ్లండ్ సంచలన ఆటతో విజేతగా నిలిచింది. అయితే.. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఇంగ్లండ్ 32 సార్లు, ఆస్ట్రేలియా 34 సార్లు ఈ సిరీస్ గెలిచాయి. మరి ఇప్పుడు విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. అవును.. ఇరు జట్లలోని ప్రధాన ఆటగాళ్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బాజ్‌బాల్(Bazz ball) ఆటతో ప్రత్యర్థులకు వణుకుపుట్టిస్తున్న ఇంగ్లండ్ ఆసీస్‌కు చెక్ పెట్టాలని అనుకుంటోంది.
ఆసీస్ బ్యాటర్లు VS ఇంగ్లండ్ బౌలర్లు
ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఓలీ పోప్(Ollie Pope) డబుల్ సెంచరీ, ఓపెనర్ బెన్ డకెట్(Ben Duckett) శతకంతో చెలరేగారు. సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ 5 వికెట్లతో రాణించాడు. అంతకుముందు పాకిస్థాన్ సిరీస్‌లోనూ హ్యారీ బ్రూక్, అండర్సన్, బ్రాడ్ విజృంభించడంతో ఇంగ్లండ్ సిరీస్ దక్కించుకుంది. ఈసారి ఇంగ్లండ్ పేస్ దళం జేమ్స్ అండర్సన్, మార్క్‌వుడ్, బ్రాడ్, ఓలీ రాబిన్సన్తో పటిష్టంగా ఉంది. దాంతో, ఆసీస్ బ్యాటర్లు, ఇంగ్లండ్ బౌలర్ల మధ్య తగ్గ పోరు ఉండనుంది.
స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్

ఫామ్‌లో టాప్ ఆటగాళ్లు
ఆసీస్ టాప్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్‌కు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో చితక్కొట్టిన ట్రావిస్ హెడ్(Travis Head), స్టీవ్ స్మిత్(Steven Smith) బౌన్సీ పిచ్‌లపై చెలరేగేందుకు ఎదురుచూస్తున్నారు. మిడిలార్డర్లో క్రీజలో పాతుకుపోయేందుకు లబూషేన్ ఉండనే ఉన్నాడు. ఇక లోయర్ ఆర్డర్లో అలెక్స్ క్యారీ ధనాధన్ ఆటతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించగలడు. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కమిన్స్ పేస్‌ను ఎదుర్కోవడం ఇంగ్లండ్ బ్యాటర్లకు సవాలే. మరోవైపు నాథన్ లియన్ తన స్పిన్‌తో ఇబ్బంది పెట్టగలడు. 2011లో ఇంగ్లండ్‌పై యాషెస్ సిరీస్ నెగ్గడంలో అతను కీలక పాత్ర పోషంచిన విషయం తెలిసిందే.
ఇరుజట్ల స్క్వాడ్స్
ఇంగ్లండ్ : బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), మోయిన్ అలీ, స్టువార్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, మాథ్యూ పాట్, డానియెల్ లారెన్స్.
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కమిన్స్(కెప్టెన్), నాథన్ లియన్. టాడ్ మర్ఫీ, జోష్ ఇంగ్లిస్, మ్యాట్ రెన్షా, మార్కస్ హ్యారిస్.
ఇవి కూడా చదవండి
BCCI | భారత జట్టు స్పాన్సర్షిప్ హక్కులకు టెండర్.. నిషేధిత బ్రాండ్లు ఇవే
ICC ODI Worldcup: అహ్మాదాబాద్‌లో ఆడేందుకు పాక్ విముఖత !
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

