BCCI : భారత క్రికెట్ బోర్డు (BCCI) భారీ ఆదాయంపై కన్నేసింది. టీమిండియా స్పాన్సర్షిప్ హక్కుల(TeamIndia Sponsorship Rights) కోసం ఈరోజు టెండర్ ప్రకటించింది. స్పాన్సర్షిప్ కోసం పలు ప్రముఖ బ్రాండ్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. టెండర్ నోటిఫికేషన్ను అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అయితే.. ఈసారి స్పాన్సర్షిప్ ప్రకటనలో 7 రకాల ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. ఆసక్తి ఉన్న కంపెనీలు రిజిష్టర్ చేసుకునేందుకు రూ. 5 లక్షలు (నాన్ – రీఫండబుల్), జీఎస్టీ కూడా చెల్లించి బిడ్స్ వేయాలని బీసీసీఐ తెలిపింది.
ఇన్విటేషన్ టు టెండర్ (Invitation To Tendor)కు దరఖాస్తుకు జూన్ 26వ తేదీ వరకు సమయం ఉంది. విదేశీ కంపెనీలకు అయితే రూ. 5,01,363.88 లక్షలు (6,100 అమెరికన్ డాలర్లు)చెల్లించాల్సి ఉంటుంది. ఆయా కంపెనీలు ఐటీటీ కోసం రూ.5 లక్షలను ఎలా చెల్లించారు? కంపెనీ పేరు?, అడ్రస్, పాన్ కార్డు నంబర్.. వంటివి teamsponsor.itt@bcci.tvకు ఈమెయిల్ చేయాలని బీసీసీఐ నోటిఫికేషన్లో పేర్కొంది. డబ్బులు కట్టిన తర్వాతే ఐటీటీకి అవసరమైన డాక్యుమెంట్లు కనిపిస్తాయని వెల్లడించింది. అంతేకాదు బిడ్డింగ్ ప్రక్రియను ఏ సమయంలోనైనా, కారణం వెల్లడించకుండానే రద్దు చేసే అధికారంం బీసీసీఐకి ఉందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలిపింది.
🚨 NEWS 🚨
Board of Control for Cricket in India (BCCI) announces the release of Invitation to Tender for National Team Lead Sponsor Rights.
Details 🔽https://t.co/dwCU39sNFR
— BCCI (@BCCI) June 14, 2023
ఇన్విటేషన్ టు టెండర్ (ఐటీటీ) కోసం కంపెనీలు కింది బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలని బీసీసీఐ తెలిపింది.
ఖాతా పేరు : ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా
అకౌటంట్ నంబర్ : 60082778272
బ్యాంకు పేరు : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ఐఎఫ్ఎస్సీ కోడ్ : MAHB0000002
టీమిండియా స్పాన్సర్షిప్ హక్కుల కోసం దరఖాస్తు చేయకుండా 7 బ్రాండ్లపై బీసీసీఐ నిషేధం విధించింది. బ్యాన్ చేసిన వాటిలో ఏమేం ఉన్నాయంటే…? అథ్లెట్లు, ఇతర క్రీడల ఆటగాళ్లు ధరించే దుస్తులు, మద్యం ఉత్పత్తులు, బెట్టింగ్, క్రిప్టోకరెన్సీ, రియల్ మనీ గేమింగ్(ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ తప్ప), పొగాకు, ప్రజా జీవితానికి హాని కలిగించే ఉత్పత్తులు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి.