Chiranjeevi | ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రమోషన్లకు దూరంగా మెగాస్టార్ చిరంజీవి.. కారణం ఇదేనా ?
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) మరికొద్ది రోజుల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది.
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) మరికొద్ది రోజుల్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో నిలుస్తున్న ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మార్కెట్, మ్యానియా ఏంటో నిరూపించేందుకు చిరంజీవి సిద్ధమయ్యారు.ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ప్రమోషనల్ వీడియోలు సినిమాపై సాలిడ్ బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, మెగాస్టార్ టైమింగ్ కలిసి ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని అభిమానుల్లో పెంచాయి. అయితే, సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు జోరుగా సాగుతున్నప్పటికీ… ఈ కార్యక్రమాల్లో ఎక్కడా మెగాస్టార్ చిరంజీవి కనిపించకపోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా చిరంజీవి సినిమాల ప్రమోషన్లలో స్వయంగా పాల్గొని మీడియా ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో సందడి చేస్తుంటారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండటంతో “చిరు ఎందుకు ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారు?” అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, చిరంజీవి ఇటీవల మోకాలి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా మోకాలి నొప్పులతో ఇబ్బంది పడుతున్న ఆయన, సినిమా షూటింగ్ పూర్తవగానే డాక్టర్ల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారని టాక్.డాక్టర్లు ఆయనకు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని సూచించడంతో, ప్రస్తుతం చిరంజీవి ఎలాంటి ఫిజికల్ స్ట్రెస్ తీసుకోకుండా రెస్ట్‌లో ఉన్నారని సమాచారం. ఈ కారణంగానే సినిమా ప్రమోషన్ల బాధ్యతలన్నింటినీ దర్శకుడు అనిల్ రావిపూడి తానే భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది.
సమాచారం ప్రకారం చిరంజీవి కనీసం మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని, దీంతో సినిమా రిలీజ్ సమయంలో కూడా ఆయన పబ్లిక్ అప్పియరెన్స్ ఉండకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్తలు బయటకు రావడంతో మెగాస్టార్ అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. అయితే, చిరంజీవి ఆరోగ్యం మెరుగుపడుతోందని, పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టనున్నారని సినీ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. ఇక ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రమోషన్లలో చివరి దశలో అయినా చిరంజీవి కనిపిస్తారా? లేక పూర్తిగా దూరంగానే ఉంటారా? అన్నదానిపై త్వరలోనే స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

