NBK 109 | టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న ఈ హీరో ప్రస్తుతం NBK 109తో పాటు అఖండ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నాడు. ఇక NBK 109 ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. వాల్తేరు వీరయ్యతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయగా.. ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్’’ అంటూ బాలయ్య తన పవర్ఫుల్ గెటప్‌లో అలరించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే అదే రోజున ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర పార్ట్- 1స రిలీజ్ కాబోతుంది. కొరటాల శివ దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతాయా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మరోవైపు వచ్చే రెండు సినిమాలు స్టార్ హీరోలవి కావడం వలన
థియేటర్ల అడ్జెస్ట్మెంట్ కాకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.