Dalit Couple | దళిత దంపతులకు చెప్పుల దండ వేసి.. స్తంభానికి కట్టేసి కొట్టారు
మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో దళిత దంపతులను (Dalit Couple) స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగకుండా వారికి చెప్పుల దండ వేసి ఊరేగించారని పోలీసులు తెలిపారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో దళిత దంపతులను (Dalit Couple) స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగకుండా వారికి చెప్పుల దండ వేసి ఊరేగించారని పోలీసులు తెలిపారు. బాధితుల కుమారుడు ఓ మహిళను వేధించిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత ఆ వృద్ధ దంపతులు ఊరు విడిచి వెళ్లారని చెప్పారు. అయితే ఈ నెల 17న తిరిగి గ్రామానికి వచ్చారని, దీంతో ఆ మహిళ భర్త మరో తొమ్మిది మందితో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు.
వారిద్దరిని స్తంభానికి కట్టేసి కొట్టారని, చెప్పుల దండ వేసి ఊరేగించారని చెప్పారు. అయితే దంపతుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన పది మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

