Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ వరల్డ్ టూర్ మొదలైంది. కానీ, టోర్నీని హైబ్రిడ్ మోడల్ (Hybrid Model)లో నిర్వహిస్తారా? లేదా పాకిస్థాన్‌లోనే జరుగుతుందా? అనే అంశం మాత్రం తేలలేదు. బీసీసీఐ అభ్యంతరాల నేపథ్యంలో టోర్నీని హైబ్రిడ్ మోడల్లో జరిపేందుకు ఐసీసీ పావులు కదుపుతోంది. కానీ, పీసీబీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. తాజాగా పాక్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) మళ్లీ పాత పాటే పాడాడు. ఎట్టిపరిస్థితుల్లోనే తమగడ్డపైనే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించి తీరుతాం అని నఖ్వీ వెల్లడించాడు. దాంతో, మెగా టోర్నీపై మరోసారి గందరగోళం నెలకొంది.
చాంపియన్స్ ట్రోఫీ ఆతథ్య హక్కులు వదులుకునేందుకు పాక్ బోర్డు అంగీకరించడం లేదు. ఐసీసీ లేఖ రాసినా సరే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు అదే రాగం ఆలపిస్తున్నాడు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన హైబ్రిడ్ మోడల్‌కు అవకాశం ఇవ్వమని తేల్చేశాడు.
Mohsin Naqvi said “sports and politics are separate and no country should mix the two.” pic.twitter.com/UlmlOXJKvF
— Himanshu Pareek (@Sports_Himanshu) November 18, 2024
‘చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన అన్ని జట్లు పాకిస్థాన్‌కు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. ఏ బోర్డుకు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఒకవేళ భారత్‌కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే మేము వాళ్లతో మాట్లాడుతాం. వాళ్ల భయాలను దూరం చేస్తాం. పాకస్థాన్‌కు రావడానికి టీమిండియాకు బలమైన కారణం ఉండదని నేను అనకుంటున్నా. అన్నిజట్లు పాక్‌కు వస్తాయని ఆశాభావంతో ఉన్నాను. ఎందుకంటే.. ఆటలు, రాజకీయాలు రెండూ వేర్వేరు. ఏ దేశాలైనా ఈ రెండిటీని ముడివేయడాన్ని నేను ఇష్టపడను. మేము అయితే అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని నఖ్వీ వెల్లడించాడు.
పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లే పరిస్థితులు కనిపించకపోవడం లేదు. మరోవూపు హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ససేమిరా అంటోంది. దాంతో, అంతర్జాతీయ క్రికెట్ మండలి నవంబర్ 11న జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్‌ను రద్దు చేసింది. ఆ మరునాడే బీసీసీఐ అభ్యంతరాలు ఏంటో మాకు చెప్పండి అంటూ ఐసీసీని పీసీబీ కోరింది. అంతేకాదు.. ఒకవేళ హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరించకుంటే దక్షిణాఫ్రికాలో టోర్నీని జరిపేందుకు ఐసీసీ ఆలోచలన చేస్తోంది.
We’re not going with the hybrid model; the Champions Trophy will be hosted entirely in Pakistan.” – PCB Chairman#ChampionsTrophy pic.twitter.com/2uSOAh2fQ4
— XCric (@XForMatchTwets) November 18, 2024
ఈ నేపథ్యంలో ఎటు చూసినా పాక్ బోర్డుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. చాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యం హక్కులు దక్కించుకున్న పాకిస్థాన్ ఆ దిశగా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ టోర్నీని సజావుగా నిర్వహించడం కోసం ఐసీసీ ఆ దేశ బోర్డుకు రూ.548 కోట్లు కేటాయించింది. ఒకవేళ ఐసీసీ మాట వినకుంటే ఆ రూ.528 కోట్లు హుష్‌కాకి అయినట్టే అంటున్నారు విశ్లేషకులు.
Get ready, Pakistan!
The ICC Champions Trophy 2025 trophy tour kicks off in Islamabad on 16 November, also visiting scenic travel destinations like Skardu, Murree, Hunza and Muzaffarabad. Catch a glimpse of the trophy which Sarfaraz Ahmed lifted in 2017 at The Oval, from 16-24… pic.twitter.com/SmsV5uyzlL
— Pakistan Cricket (@TheRealPCB) November 14, 2024
‘పాకిస్థాన్ ప్రజలరా సిద్ధంగా ఉండండి. నవంబర్ 16వ తేదీన ఇస్లామాబాద్‌లో చాంపియన్స్ ట్రోఫీ టూర్ మొదలవ్వనుంది. అక్కడి నుంచి పర్యాటక ప్రాంతాలైన స్కర్దు, ముర్రీ, హుంజా, ముజఫరాబాద్లలో కూడా ట్రోఫీని సందర్శనకు పెడుతాం. 2017లో ఓవల్ మైదానంలో సర్ఫరాజ్ అహ్మద్ అందుకున్న ఈ ట్రోఫీని నవంబర్ 16 నుంచి 24వ తేదీల మధ్య చూసి తరించండి’ అని పీసీబీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. అయితే.. వివాదాస్పద ప్రాంతాల్లో ట్రోఫీని ప్రదర్శించేందుకు అనుమతి లేదంటూ టూర్‌ను రద్దు చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అభ్యంతరాల మేరకు ఐసీసీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.