Lagacherla | చావడానికైనా సిద్ధం కానీ మా భూములు ఇచ్చేది లేదని లగచర్ల బాధితులు స్పష్టం చేశారు. లగచర్ల బాధితులు సోమవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వ దమనకాండను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు చెడ్డపేరు తెస్తున్నారన్నారని.. రేవంత్ సర్కారు బలవంతంగా మా భూములు గుంజుకుంటోందని ఆరోపించారు. మా భూముల కోసం ఆందోళనలు చేసినా ఫలితం లేదని.. కలెక్టర్‌పై దాడులు చేశామనడం అబద్ధమన్నారు. కొన్ని రోజులుగా తిండిపోవడం లేదు.. నిద్రపోవడం లేదన్నారు. మా భూములు నమ్ముకొని మేం బతుకుతున్నం.. మాపై సర్కారుకు ఎందుకింత పగ అంటూ ప్రశ్నించారు. లగచర్ల బాధితురాలు జ్యోతి మాట్లాడుతూ మా లగచర్ల భూములే ప్రభుత్వానికి కావాలా? వేరే భూములు లేవా ? అంటూ ప్రశ్నించింది.
రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వచ్చినప్పుడు 2 బస్సుల్లో పోలీసులు వచ్చారు.. అదే కలెక్టర్ వచ్చినప్పుడు 2 పోలీసులు కూడా ఎందుకు రాలేదు – లగచర్ల గిరిజన మహిళ pic.twitter.com/KdpZoTf5Nt
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2024
మా భూముల కోసం మే ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నామని.. భూములు ఎలా ఇవ్వరో చూస్తామంటూ బెదిరిస్తున్నారన్నారంటూ ఆరోపించింది. ఫార్మా కంపెనీతో వాతావరణం కాలుష్యమవుతుందని.. ఫార్మా కంపెనీతో మా ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పింది. చావడానికైనా సిద్ధం కాని మా భూములు ఇచ్చేది లేదని.. ఫార్మా పెట్టేది మా కోసం కాదు.. సీఎం అన్న కోసం పెడుతున్నరని పేర్కొంది. రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు? అంటూ నిలదీసింది. కలెక్టర్‌పై ఎవరూ దాడి చేయలేదు.. కలెక్టర్ కూడా దాడి చేయలేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రజాభిప్రాయం సేకరించే ప్రాంతంలో పోలీసులు బందోబస్తు పెట్టలేదని.. అర్ధరాత్రి కరెంటు, ఇంటర్నెట్ బంద్ చేసి మా ఇండ్లపై దాడి చేశారని వాపోయింది. ఆడపిల్లలపై దాడి చేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? అంటూ ప్రశ్నించింది. మా వాళ్లను చితక్కొట్టి చిత్రహింసలకు గురి చేశారని.. చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
గుంట భూమి కూడా ఇవ్వము.. చావడానికి అయినా సిద్దం, చంపడానికి అయినా సిద్దం
రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా.. ముఖ్యమంత్రి ఇదే పని చేస్తాడా
కొడంగల్ పేరు మొత్తం కరాబ్ చేశావు – కొడంగల్ గిరిజన మహిళ pic.twitter.com/8V5852aCzs
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2024