అమరావతి : ఏపీలోని విజయవాడలో సస్పెన్షన్కు గురైన ఏఎస్సై ( ASI ) ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలోని పడమట ఏఎస్సై గోపి( Gopi ) ఓ కేసు విషయంలో బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన గోపి రెండు రోజుల క్రితం ఆత్మహత్య లేఖ రాసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెదపులిపాక సమీపంలో అతడి మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఏఎస్సైకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.