‘వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందస్తు జాగ్రత్తలే మేలు’
న్యాయవాదులు, న్యాయవాద సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటేల్ అన్నారు. గురువారం నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్.ఎల్. హాస్పిటల్ సహకారంతో జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌కు...
– నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటేల్
– నల్లగొండ కోర్టు ఆవరణలో మెగా హెల్త్ క్యాంప్
రామగిరి, జూలై 23 : న్యాయవాదులు, న్యాయవాద సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటేల్ అన్నారు. గురువారం నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్.ఎల్. హాస్పిటల్ సహకారంతో జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. నేటి సమాజంలో పర్యావరణ కాలుష్యం, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత రోజుల్లో సంపాదనలో దాదాపు 25 శాతం వైద్యానికే ఖర్చు చేయాల్సి వస్తోందని, వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందస్తు జాగ్రత్తలే మేలని సూచించారు.
న్యాయవాదులు నిరంతరం మానసిక ఒత్తిడి, కోర్టు కార్యకలాపాల్లో తీరికలేని జీవనం గడపడం వల్ల బిపి, మధుమేహం, గుండె, వెన్నునొప్పి వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఇటువంటి హెల్త్ క్యాంపుల ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స పొందే వీలుంటుందన్నారు. ఆరోగ్యవంతమైన న్యాయవాది సమాజానికి మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని పేర్కొన్నారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన బార్ అసోసియేషన్, ఆర్.ఎల్. హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కవిత, సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తమరావు, మున్సిఫ్ జడ్జీలు హిమబిందు, సాయి సేరణ్ తేజ, మేఘన, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆకవరపు సతీష్ కుమార్, బచ్చనబోయిన అశోక్ కుమార్, ఉపాధ్యక్షురాలు నూకల సంధ్యారాణితో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు జనిగల రాములు, పులిజాల కార్తీక్, పందుల సైదులు, మల్లేపల్లి ఆదిరెడ్డి, వి.సురేందర్ రెడ్డి, నాంపల్లి నరసింహ, చక్రవర్తి, కె.యాదయ్య పాల్గొన్నారు.

‘వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందస్తు జాగ్రత్తలే మేలు’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

