IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ కోసం 17 సీజన్లుగా నిరీక్షిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కొత్త కోచ్‌ను నియమించుకుంది. ఇప్పటికే బ్యాటింగ్ కోచ్‌గా దినేశ్ కార్తిక్(Dinesh Karthik)ను తీసుకున్న ఆర్సీబీ తాజాగా బౌలింగ్ కోచ్‌ను ఖరారు చేసింది. ముంబై హెడ్‌కోచ్‌గా ఉన్న ఓంకార్ సాల్వి (Omkar Salvi)ను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది బెంగళూరు యాజమాన్యం.
17వ సీజన్లో సాల్వి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. దాంతో, అతడిని తమ బౌలింగ్ యూనిట్ బలంగా మార్చుకోవలని భావించిన ఆర్సీబీ 18వ సీజన్ కోసం కోచ్‌గా బాధ్యతలు కట్టబెట్టింది.
🚨 Announcement: 🚨 Omkar Salvi, current Head Coach of Mumbai, has been appointed as RCB’s Bowling Coach. 🤝☄️
Omkar, who has won the Ranji Trophy and Irani Trophy in the last 8 months, is excited to join us in time for #IPL2025, after completion of his Indian domestic season… pic.twitter.com/S0pnxrtONK
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 18, 2024
మాజీ పేసర్ అయిన ఓంకార్ సాల్వికు దేశవాళీలో కోచ్‌గా సుదీర్ఘ అనుభం ఉంది. అతడు 2023-24వ సీజన్లో ముంబై జట్టుతో కలిశాడు. అతడి హయాంలో ముంబై రికార్డు స్థాయిలో 43వసారి రంజీ ట్రోఫీ చాంపియన్ అయింది. అంతేకాదు ఆ తర్వాత జరిగిన ఇరానీ కప్‌లోనూ ముంబై విజేతగా నిలవడంలో సాల్వి కీలక పాత్ర పోషించాడు.
Director of Cricket, Mo Bobat, is thrilled to welcome Omkar Salvi as RCB’s new Bowling Coach! 🚀
Omkar’s sharp technical insights and leadership skills are set to supercharge our squad in #IPL2025! 🔥#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/OVXoU8dAeX
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 18, 2024
పద్దెనిమిదో సీజన్లో అయినా ట్రోఫీ కలను సాకారం చేసుకోవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. అందుకని ఫ్రాంచైజీ కోచింగ్ స్టాఫ్ కోసం భారీ కసరత్తు చేసింది. అనుభవజ్ఞుడైన ఆండీ ఫ్లవర్‌ను హెడ్‌కోచ్‌గా తెచ్చకుంది. 17వ సీజన్ తర్వాత వీడ్కోలు పలికిన వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తిక్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, మెంటార్‌గా తీసుకుంది. ఇప్పుడు ఓంకార్ సాల్వి రాకతో బెంగళూరు బౌలింగ్ యూనిట్ దృఢంగా మారనుంది.
ఆర్సీబీ కోచింగ్ బృందం : ఆండీ ఫ్లవర్(ప్రధాన కోచ్), దినేశ్ కార్తిక్(బ్యాటింగ్ కోచ్, మెంటర్), ఆడమ్ గ్రిఫిత్ (అసిస్టెంట్ కోచ్), నీల్ మెకంజీ(అసిస్టెంట్ కోచ్), శిఖా ధనుండియాల్ (టీమ్ డైరెక్టర్), మలొలాన్ రంగరాజన్(హెడ్ ఆఫ్ స్కౌంటింగ్, అసిస్టెంట్ కోచ్).