T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్ వేదిక మారడంతో అన్ని జట్లు సన్నద్ధతలో వేగం పెంచాయి. అక్టోబర్‌లో యూఏఈ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ కోసం ఆదివారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్క్వాడ్‌ను ప్రకటించింది. ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసినట్టు పీసీబీ తెలిపింది.
విశేషం ఏంటంటే.. ఆసియా కప్‌కి సెలెక్ట్ అయిన 14 మంది ఈ మెగా టోర్నీ బెర్తు దక్కించుకున్నారు. అయితే.. శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ఆసియా కప్‌లో పాక్ సారథిగా విఫలమైన నిడా దార్(Nida Dhar)పై వేటు వేసిన సెలెక్టర్లు ఫాతిమా సనా(Fatima Sana)కు పగ్గాలు అప్పగించారు.
.@imfatimasana named Pakistan captain for ICC Women’s T20 World Cup 2024 🚨
Our squad for the marquee event 🇵🇰#BackOurGirls pic.twitter.com/NWoF6RmyVH
— Pakistan Cricket (@TheRealPCB) August 25, 2024
ఆల్‌రౌండర్ అయిన సనా ఇప్పటివరకూ రెండు వన్డేల్లో మాత్రమే పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇక ఆసియా కప్‌లో రాణించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సదియా ఇక్బాల్ ఫిట్నెస్ను బట్టి ఎంపిక చేసే అవకాశముందని పీసీబీ వెల్లడించింది.
పాకిస్థాన్ స్క్వాడ్ : ఇరమ్ జావెద్, ఒమైమా సొహైల్, సిద్రా అమిన్, తస్మియా రుబాబ్, సదియ ఇక్బాల్, ఫాతిమా సనా(కెప్టెన్), నిడా దార్, సయ్యెద అరూబ్ షా, అలియా రియాజ్, మునీబ్ అలీ(వికెట్ కీపర్), గుల్ ఫెరొజా(వికెట్ కీపర్).
ట్రావెలింగ్ రిజర్వ్ : నజియ అల్వీ(వికెట్ కీపర్), నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ : రమీన్ షిమిమ్, ఉమ్మే ఇ హని.
మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ అనుకున్నట్టే ప్రపంచ కప్ వేదిక మారింది. బంగ్లాదేశ్(Bangladesh)లో అందోళనకర పరిస్థితుల దృష్ట్యా మెగా టోర్నీని యూఏఈ(UAE)లో జరిపేందుకు ఐసీసీ(ICC) సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు యూఏఈలో వరల్డ్ కప్ పోటీలు నిర్వహిస్తామని వెల్లడించింది.