నల్లగొండ : నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో(Nallagonda Government Hospital) మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుర్చీలో కూర్చొని డెలివరీ అయిన గర్భిణి ఘటన మరువక ముందే మరో విషాదకర సంఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన శిశువు మృతి(Baby died )చెందడం కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణి చెరుకుపల్లి శ్రీలతకు నొప్పులు రావడంతో ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లేందుకు సిద్ధపడింది.
అయితే నల్లగొండ ప్రభుత్వ ప్రభుత్వ దవాఖాన వైద్యురాలు శ్రీలతను మందలించి ఆపరేషన్ చేస్తామని తిరిగి పిలిచారని తెలిపారు. కాగా, బలవంతంగా డెలివరీ చేయడంతో పండంటి శిశువు మృతి చెందిందని, కుర్చీలో డెలివరీ ఘటనలో ఉన్నతాధికారుల మందలించారనే కోపంతోనే ఆపరేషన్ చేసి శిశువును చంపారని బాధితుల ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.