నార్త్ సౌండ్: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్(Pat Cummins) చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన క్రికెటర్‌గా నిలిచాడు. సూపర్ 8 స్టేజ్‌లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్యాట్ ఆ ఘనతను తన సొంతం చేసుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ నమోదు కావడం ఇదే మొదటది. 31 ఏళ్ల కమ్మిన్స్.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి రెండు బంతుల్లో మహమ్మదుల్లా, మహేది హసన్ వికెట్లను తీశాడు. ఆ తర్వాత 20వ ఓవర్లో తొలి బంతికే తౌహిద్ హృదయ్ వికెట్ తీసి తన పేరిట హ్యాట్రిక్ రికార్డును వేసుకున్నాడు.
కమ్మిన్స్ టీ20 కెరీర్లో అతనికి ఇది ఫస్ట్ హ్యాట్రిక్. జూనియర్స్ ఆడుతున్న సమయంలో కొన్ని హ్యాట్రిక్ వికెట్లు తీశానని, కానీ ఆస్ట్రేలియా తరపున హ్యాట్రిక్ తీయడం ఇదే మొదటిసారి అని ప్యాట్ కమ్మిన్స్ తెలిపాడు. ఆసీస్ తరపున గతంలో ఆస్టన్ అగర్, నాథన్ ఎల్లిస్‌లు టీ20ల్లో హ్యాట్రిక్ తీశారు. ఆ క్లబ్లో చేరడం సంతోషంగా ఉందన్నాడు.
గతంలో ఆస్ట్రేలియా తరపున టీ20ల్లో బ్రెట్ లీ హ్యాట్రిక్ తీశాడు. 2007 వరల్డ్‌కప్‌లో అతను ఆ రికార్డును నమోదు చేశాడు. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఆసీస్ బౌలర్ వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ తీయడం విశేషం. 2021లో వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ క్యాంపర్, శ్రీలంక స్పిన్నర్ హసరంగ, సౌతాఫ్రికా బౌలర్ రబడలు తమ పేరిట హ్యాట్రిక్ నమోదు చేశారు. ఇక 2022లో యూఏఈ బౌలర్ కార్తీక్ మరియప్పన్, ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్ తీసుకున్నారు.
PAT CUMMINS BECOMES THE FIRST AUSTRALIAN TO TAKE MEN’S T20I WC HAT-TRICK AFTER 17 LONG YEARS. 🐐 pic.twitter.com/rt9rC5hImA
— Johns. (@CricCrazyJohns) June 21, 2024