IPL 2025 : ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగల వీరుడు రిషభ్ పంత్ (Rishabh Pant). విదేశీ గడ్డపై భారత జట్టు చిరస్మరణీయ విజయాల్లో ఈ చిచ్చరపిడుగు కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్(IPL)లోనూ దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడీ లెఫ్ట్ హ్యాండర్. కానీ, అదంతా గతం అని చెప్పాల్సిన రోజులు వచ్చాయి. అవును.. 18వ సీజన్లో పంత్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. కెప్టెన్‌గా ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు.
విధ్వంసక ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అయిన పంత్ 10 మ్యాచుల్లో 110 రన్స్ కొట్టాడంతే. దాంతో, అతడి ఫామ్ ప్రభావం లక్నో సూపర్ జెయింట్స్(LSG)ను కలవరపెడుతోంది. ఈ డాషింగ్ బ్యాటర్ వైఫల్యం లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాల్ని సంక్లిష్టం చేస్తోంది.
I don’t have any issue if Rishabh Pant Countinue to fail for the Lucknow Super Giants because Sanjiv Goenka deserve this shit.
But pant kind of fraud should always be kept away from the Team india T20 and side,he is still a assets in test for test side.pic.twitter.com/kfYtO74u1B
— Sujeet Suman (@sujeetsuman1991) April 22, 2025
మూడేళ్ల క్రితం కారు యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన పంత్ మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. ఏడాది విరామం తర్వాత ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన అతడు ఢీల్లీ క్యాపిటల్స్ సారథిగా, మిడిలార్డర్ బ్యాటర్‌గా చెలరేగి ఆడాడు. దాంతో, ఈ లెఫ్ట్ హ్యాండర్ తమ జట్టు రాత మారుస్తాడని సంజీవ్ గోయెంకా టీమ్ భావించింది.
అందుకే.. వేలలో పోటీ పడి మరీ రూ.27 కోట్లకు పంత్‌ను దక్కించుకుంది లక్నో. అయితే.. మైదానంలోకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. పంత్ 9 మ్యాచుల్లో 100 పరుగులతో తీవ్రంగా నిరాశ పరిచాడు. ఓపెనర్‌గా, 4 వ స్థానంలో, 7వ స్థానంలో ఆడిన పంత్.. ఒకే ఒక హాఫ్ సెంచరీతో సరిపుచ్చాడు. 10 మ్యాచుల్లో లక్నో సారథి 0, 15, 2, 2, 21, 63, 3, 0, 4 పరుగులు స్కోర్ చేశాడు.
ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ ఒత్తిడిని చిత్తు చేసే పంత్ ఈసారి ఎందుకనో తన మ్యాజిక్ చేయలేకపోతున్నాడు. తనబలమైన స్వీప్ షాట్లను నిక్కచ్ఛిగా ఆడలేక వికెట్ పారేసుకుంటున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగాల్సిన అతడు స్వల్ప స్కోర్‌కు వెనుదిరుగడంతో మిడిలార్డర్‌పై, టెయిలెండర్లపై భారం పడుతోంది.
Rishabh Pant IN IPL 2025
110 runs in 10 matches has lowest Avg & SR (min 8 inns) and has Grade A central contract. Doesn’t deserve to be even in school level T20 team. This is such a disrespect to Indian cricket. Shame on @BCCI
And this mediocrity was compared to Sanju Samson. pic.twitter.com/06oH5piq51— 🧢🩷 (@Rosh_met_Sanju) April 27, 2025
ఇప్పటివరకూ 10 మ్యాచుల్లో 5 విజయాలు సాధించిన లక్నో ఆరో స్థానంలో ఉంది. చివరి నాలుగు మ్యాచుల్లో తప్పకుండా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్తు దక్కుతుంది. ఈ నేపథ్యంలో పంత్.. గర్జించాలని యాజమాన్యం భావిస్తోంది. మే 4న పంజాబ్ కింగ్స్‌తో, మే 9న ఆర్సీబీతో, మే 14న గుజరాత్ టైటాన్స్‌తో, మే 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పంత్ సేన తలపడనుంది.