Danish Kaneria | పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అఫ్రిది అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా మండిపడ్డాడు. మాజీ ప్లేయర్ అసలు రంగును బయటపెట్టాడు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అడ్డగోలుగా మాట్లాడాడు. భారత్ ఎలాంటి ఆధారాలు లేకుండానే పాకిస్తాన్‌పై ఆరోపణలు చేయడం తనను నిరాశ పరిచిందని చెప్పాడు. ఇలాంటి చర్యలు ఉద్రిక్తతలు పెంచుతాయని.. శాంతి ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందని, ఇలాంటి చర్యలు ఉద్రిక్తతలను పెంచుతాయని పేర్కొన్నారు. నిందలు వేసే ఆట ఆడటానికి బదులుగా, భారత్ చర్చల్లో పాల్గొనాలని.. క్రికెట్‌ను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చెప్పుకొచ్చాడు. అలాగే, దాడి జరిగిన పది నిమిషాల్లోనే ఇస్లామాబాద్‌పై న్యూఢిల్లీ నిందలు వేసిందని.. ఇస్లాం శాంతియుతంగా జీవించాలని బోధిస్తుందని.. పాకిస్తాన్ అలాంటి చర్యలకు మద్దతు ఇవ్వదని.. భారత్ తనను తానే నిందించుకోవాలంటూ వ్యాఖ్యానించాడు.
అయితే, అఫ్రిది వ్యాఖ్యలపై డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా అఫ్రిదిపై విరుచుకుపడ్డాడు. అతను (అఫ్రిది) ఎప్పుడు తీవ్రవాద ఆలోచనలతోనే ఉంటాడని.. అతనికి భారత టెలివిజన్స్, దేశంలో (పాకిస్తాన్)లో వేదిక ఇవ్వొద్దని వ్యాఖ్యానించాడు. అంతే కాకుండా తనను ఇస్లాం మతంలోకి మారమంటూ ఒప్పించేందుకు ప్రయత్నించాడని.. తనతో కలిసి భోజనం చేసేందుకు కూడా నిరాకరించాడని.. ఇది తనకు చాలా అవమానంగా అనిపించిందని కనేరియా ట్వీట్ చేశాడు. ఇంతకు ముందు హహల్గాం దాడికి పాకిస్తాన్ కారణమంటూ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్తిసాన్ షాబాజ్ షరీఫ్‌ను సైతం వదల్లేదు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన విమర్శలకు సైతం దీటుగా బదులిచ్చాడు. తాను హిందువునేనని.. అందుకు గర్వపడుతున్నట్లు తెలిపాడు. హిందువుగా జన్మించిన దేశం కోసం సేవ చేశానని, ఆడినట్లుగా పేర్కొన్నారు. ప్రపంచంలో హిందువులు ఎక్కడ నివసించినా, తమ దేశానికి విశ్వాసపాత్రులుగా, అంకితభావంతో ఉంటారని వ్యాఖ్యానించాడు.