IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో యోధుడిలా పోరాడుతున్న రిషభ్ పంత్ (54) సూపర్ హాఫ్ సెంచరీ బాదాడు. శార్థూల్ ఠాకూర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్.. స్టోక్స్ ఓవర్లో కవర్స్ దిశగా బౌండరీలో ఫిఫ్టీ సాధించాడు. కుడిపాదం నొప్పని భరిస్తూనే ఇంగ్లండ్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొంటున్న వైస్ కెప్టెన్ టెయిలెండర్లతో కలిసి జట్టుకు ఉపయుక్తమైన పరుగులు జోడించాలనుకున్నాడు. కానీ, ఆర్చర్ సంధించిన బంతిని డిఫెన్స్ చేయలేక బౌల్డ్ అయ్యాడు. దాంతో, భారత్ 349 వద్ద 9 వ వికెట్ కోల్పోయింది.
లంచ్ తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(5-72) విజృంభణతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. వర్షం అంతరాయం కారణంగా 321-6తో భోజన విరామానికి వెళ్లిన టీమిండియా మరో 28రన్స్‌కే మూడు వికెట్లు పడ్డాయి. ఊరించే బంతితో వాషింగ్టన్ సుందర్(27 )ను ఔట్ చేసిన స్టోక్స్.. అరంగేట్రం కుర్రాడు అన్షుల్ కంభోజ్(0)ను డకౌట్‌గా వెనక్కి పంపి ఐదో వికెట్ సాధించాడు. కాసేపటికే అతడి ఓవర్లో బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్‌ను ఆర్చర్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం బౌలింగ్ ద్వయం బుమ్రా(4 నాటౌట్), సిరాజ్(5 నాటౌట్)లు వీలైనన్ని రన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Ben Stokes has his first Test five-for since September 2017! 🔥 pic.twitter.com/YXjmk8gpN0
— ESPNcricinfo (@ESPNcricinfo) July 24, 2025