జూలూరుపాడు, జూలై 24 : ఐటీలో తెలంగాణను బ్రాండ్ అంబాసిడర్గా చేసి, యువతకు మార్గదర్శకంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా మార్చి వేలాది మంది యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన వ్యక్తి కేటీఆర్ అని కొనియాడారు. భవిష్యత్లో ఆయన మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు చావా వెంకట రామారావు, సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, లకావత్ హేమ్లా, రెడ్డిబోయిన రాము, మాజీ ఎంపీటీసీ ఓడ వెంకటేశ్వర్లు, భూక్యా దేవిలాల్ నాయక్, మండల నాయకులు తాళ్లూరి రామారావు, పోతురాజు రామారావు, ఇల్లంగి తిరుపతి, యువజన నాయకులు, పొట్ల జగన్, భూక్యా మహేశ్, గుమ్మడి మహేశ్, ప్రతాప్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.