IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (55 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. గాయం తాలుకు నొప్పిని భరిస్తూనే ఇంగ్లండ్ బౌలర్ల భరతం పడుతున్న పంత్ సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు. స్టోక్స్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ ఆడబోయి ఎడమ చేతి చూపుడు వేలికి బంతిని తగిలించుకున్న ఈ డాషింగ్ బ్యాటర్.. అదే ఓవర్ ఆఖరి బంతిని లెగ్ సైడ్ స్టాండ్స్‌లోకి పంపి ఫిఫ్టీ సాధించాడు. ఇంగ్లండ్‌పై పంత్‌కు ఇది ఎనిమిదో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ (85 నాటౌట్) తన క్లాస్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని కంగారెత్తిస్తున్నాడు. ఇప్పటివరకూ తొలి సెషన్లో ఇంగ్లండ్ పేసర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతున్న ఈ జోడీ నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రస్తుతానికి భారత్ స్కోర్.. 216/3. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 171 పరుగులు వెనకబడి ఉంది గిల్ సేన.
Most 50+ scores by a wicketkeeper in a country away from home:
𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 𝗣𝗮𝗻𝘁 (𝗜𝗡𝗗) 𝗶𝗻 𝗘𝗻𝗴𝗹𝗮𝗻𝗱 – 𝟴*
MS Dhoni (IND) in England – 8
John Waite (SA) in England – 7 pic.twitter.com/0N4C4Stkol— ESPNcricinfo (@ESPNcricinfo) July 12, 2025
ఓవర్ నైట్ స్కోర్ 145-3తో మూడో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా స్కోర్‌బోర్డు ఊపందుకుంది. తొలి సెషన్లో కేఎల్ రాహుల్(85 నాటౌట్), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(55 నాటౌట్).. జాగ్రత్తగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఒక దశలో వరుసగా 5 ఓవర్లలో ఒక్క రన్ రాలేదు. అయినా సరే ఓపిక వహించి క్రీజులో నిలిచిన పంత్ వోక్స్ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో బౌండరీతో గేర్ మార్చాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు రన్స్ జోడించింది. కార్సే ఓవర్లో రాహుల్ స్క్వేర్ లెగ్, బ్యాక్వర్డ్ పాయింట్ లెగ్ సైడ్ దిశగా హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. అనంతరం పంత్ మరింత దూకుడుగా ఆడి స్టోక్స్ బౌలింగ్‌లో సిక్సర్‌తో 86 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.