కోదాడ, జూలై 11 : నీతి నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యం కమ్యూనిస్టు యోధుడు దొడ్డ నారాయణరావు అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు దొడ్డా నారాయణరావు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం చిలుకూరు మండల కేంద్రంలో ఆయన మృతదేహానికి జగదీశ్‌రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. తన తుది శ్వాస వరకు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆచరించిన ఆదర్శ నేత నారాయణరావు అని కొనియాడారు. ఎంపీపీగా, పీఏసీఎస్ చైర్మన్‌గా అన్ని వర్గాల ప్రజలకు సేవలందించిన మహనీయుడన్నారు. ఆయన జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ నారాయణరావు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్ కుమార్, ఏలూరు వెంకటేశ్వరరావు, శివాజీ నాయక్, శీలం సైదులు, జానకి రామాచారి, తాళ్లూరు శ్రీనివాస్, రాంబాబు, అలసగాని జనార్ధన్, నాగరాజు, ఎస్కే నయీమ్ ఉన్నారు.
Kodada : నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యం దొడ్డ నారాయణరావు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి