BC reservation drama | గోదావరిఖని : రాష్ట్రంలో బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరు కంటి చందర్ మండిపడ్డారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఆర్డినెన్స్ ను తీసుకువస్తున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు వ్యవహార శైలిపై పలు అను మానాలు కలుగుతున్నాయని, ఇందులో ద్రోహంతో కూడిన కుట్ర కనిపిస్తున్నదని… వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లు కొల్లగొ ట్టేందుకే ఈ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను దండుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ పై ఆర్డినెన్స్ నాటకం మొదలు పెట్టిందని ఆయన అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని వెల్లడించి, 20 నెలలు కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరిగిందని, ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని ఆరోపించారు. గతంలో మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ పెంచాలని, చూస్తే కోర్టులు కొట్టివేసిన విషయం ప్రభుత్వానికి తెలియదా…? అని ప్రశ్నించారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, జాతీయస్థాయిలో ప్రతిపక్ష హో దాలో ఉన్న అయినప్పటికీ బీసీ బిల్లు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసు కురాలేదని విమర్శించారు. అన్నీ తెలిసి కూడా బీసీలకు ద్రోహంచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నామన్నారు. 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ సర్కారు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల విష యంలో ఈ సర్కార్ ఘరానా మోసానికి పాల్పడుతుందని, అసెంబ్లీలో పెట్టిన బీసీ బిల్లులను గవర్నర్ ద్వారా ఢిల్లీకి పంపారని, ప్రస్తుతం అది కేంద్రం వద్ద ఉన్నదని, ఈ నేపథ్యంలో ఇప్పుడు దానిని కాదని, ఆర్డినెన్స్ తీసుకురావడమేమిటని ప్రశ్నించారు. గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఇలాగే జీవో జారీ చేస్తే అవి కోర్టుల్లో నిలబడలేదని గుర్తు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి బీసీ లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు,బొడ్డు రవీందర్,నారాయణదాసు మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, గాదo విజయ, పిల్లి రమేష్ జిట్టవేన ప్రశాంత్, గుంపుల లక్ష్మీ,నూతి తిరుపతి, బుర్ర వెంకటేష్, కొడి రామకృష్ణ సత్యప్రసాద్, నీరటి శ్రీనివాస్, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్ కుమార్ నాయక్, ముక్కెర మొగిలి గుర్రం పద్మ గౌడ్, సారయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.