Mumbai Test : అనూహ్య మలుపులు తిరిగిన ముంబై టెస్టులో ‘రిషభ్ పంత్ (Rishabh Pant) ఔట్ కాకపోయి ఉంటే మనం గెలిచేవాళ్లం’.. ఈ మాట మనసులో అనుకోని అభిమానులు ఉండరు. 29 పరుగులకే 4 వికెట్లు పడిన దశలో క్రీజులోకి వచ్చిన పంత్ ఓ యోధుడిలా పోరాడాడు. పర్యాటక జట్టు స్పిన్ ఉచ్చును ఛేదిస్తూ పరుగులు దొంగిలించాడు. లంచ్ తర్వాత ధనాధన్ ఆడబోయిన పంత్ అనూహ్యంగా వెనుదిరిగాడు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ కోసం కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కెప్టెన్ టామ్ లాథమ్ రివ్యూ తీసుకొని మరీ న్యూజిలాండ్ అతడి వికెట్ సాధించింది. అసలేం జరిగిందంటే..?
లంచ్ అనంతరం ఎదురుదాడికి దిగిన పంత్ అజాజ్ పటేల్ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత బంతిని డిఫెన్స్ చేయబోగా అది గాల్లోకి లేచింది. దాంతో, అది క్యాచ్ ఔట్ అని కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. రిప్లేలో స్పైక్ కనిపించడంతో టీవీ అంపైర్ పంత్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఇదే విషయమైన పంత్ ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ‘బంతి నా ప్యాడ్‌కు తగిలింది’ అని చెబుతూ వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
It is completely and clearly visible that the bat is touching the pad and not the ball
Due to which there was a disturbance in the ultra edge and Rishabh Pant is also saying the same thing but the umpire is not able to understaand
That’s why we need HotSpot + UltraEdge in DRS.… pic.twitter.com/EW8dKgPDqY
— Sundram (@Sundram01) November 3, 2024
కానీ, టీవీ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి జట్టును గెలిపించలేకపోయానే అనే బాధతో పెవిలియన్ బాట పట్టాడు. పంత్ వివాదాస్పదంగా ఔట్ కావడంపై మ్యాచ్ అనంతరం సారథి రోహిత్ శర్మ స్పందించాడు. ‘టీవీ అంపైర్ పంత్‌ను ఔట్ అని చెప్పడంతో షాకయ్యాను. డీఆర్ఎస్ విధానం ఎవరికైనా ఒకేలా ఉండాలి. ఒకవేళ రీప్లేలో స్పష్టంగా తెలియనప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణయమే ఫైనల్ కావాలి’ అని హిట్‌మ్యాన్ అన్నాడు.
BIG MOMENT IN THE GAME!!!
Rishabh Pant was given OUT as Caught in DRS but Pant Suggested that it was Bat hitting the Pad. [Jio Cinema]#Rishabpant #INDvNZ pic.twitter.com/JhSwISdivl
— Raizer (@realraizer_) November 3, 2024
క్వీన్‌స్వీప్ తప్పాలంటే వాంఖడేలో పోరాటమే శరణ్యమని తెలిసినా భారత టాపార్డర్ కుప్పకూలింది. అజాజ్ పటేల్ దెబ్బకు మేము క్రీజులో ఉండలేమంటూ శుభ్‌మన్ గిల్(1), విరాట్ కోహ్లీ(1), సర్ఫరాజ్ ఖాన్(1)లు పెవిలియన్ చేరారు. ఇక అందరి ఆశలు మోస్తూ క్రీజులోకి వచ్చిన పంత్ ఉన్నంత సేపు స్వీప్ షాట్లతో అలరించాడు. టైమింగ్ కుదరకున్నా పట్టుదలగా ఆడుతూ రవీంద్ర జడేజా(6), వాషింగ్టన్ సుందర్(12)లతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో, పంత్ భారత్‌ను గెలిపించడం ఖాయం అనుకున్నారంతా. కానీ, లంచ్ తర్వాత కథ మారింది. అనూహ్యంగా పంత్ 64 వద్ద ఔట్ అయ్యాడు. అంతే.. ఆ తర్వాత 21 పరుగులకే టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. వరుసగా మూడో ఓటమితో రోహిత్ సేనకు వైట్‌వాష్ తప్పలేదు.