యాదాద్రి భువనగిరి : వచ్చే ఏడాది మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను పూర్తి చేసి 4వేల మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్డుకు అనుసంధానం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti )అన్నారు. ఆదివారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మంత్రుల బృందం పర్యటించిది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్ లోని స్టేజి-1 లో అవుతున్న విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్డుకు అనుసంధానం చేసే కార్యక్రమం ఈరోజు విజయవంతంగా జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని 2028-29 నాటికి 22,288 మెగావాట్లు అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
విద్యుత్తుకు ఇబ్బంది రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాతావరణం కలుషితం కాకుండా 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో న్యూఎనర్జీ పాలసీని(New energy policy) త్వరలోనే తీసుకువస్తామని స్పష్టం చేశారు. న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురావడంలో మేధావులు విద్యుత్తు నిష్ణాతులతో చర్చించి వారి అభిప్రా యాలు తీసుకొని శాసనసభలో చర్చించి అందరి అభిప్రాయంతో న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువస్తామన్నారు.