IPL 2025 Mega Auction : టీ20 ఆటకు కేరాఫ్.. సుదీర్ఘ ఫార్మాట్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు.. మెరుపు బ్యాటింగ్ చేస్తూ ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తుంటాడు.. అంతేనా వికెట్ కీపింగ్‌లోనూ అదరగొట్టేస్తాడు.. ఇన్ని విశేషాలు ఎవరి గురించే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును.. భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) గురించే. ఈ చిచ్చరపిడిగు 9 ఏండ్ల తర్వాత ఇండియన ప్రీమియర్ లీగ్ వేలానికి వస్తున్నాడు.
ఎనిమిది సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా ఉన్న అతడిని ఫ్రాంచైజీ వదిలించుకుంది. దాంతో, పంత్ వేలంలో పాల్గొననున్నాడు. ఈసారి మెగా వేలంలో ఈ లెఫ్ట్ హ్యాండర్ రూ.25 నుంచి రూ.30 కోట్ల రికార్డు ధర పలుకుతాడని క్రీడా పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ డాషింగ్ బ్యాటర్‌ను కొనేందుకు పలు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి.
🚨 NO RISHABH PANT FOR DELHI. 🚨
– Delhi Capitals have finalised Axar, Kuldeep, Stubbs and Abhishek Porel as their retention for IPL 2025. (Sahil Malhotra/TOI). pic.twitter.com/OgK2rPBFzX
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2024
కారు యాక్సిడెంట్ కారణంగా ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన పంత్ పునరామనంలో రెచ్చిపోతున్నాడు. పరగులదాహంతో ఉన్న అతడు ఐపీఎల్లో అదరగొట్టేశాడు. ఆపై టీ20 వరల్డ్ కప్‌లో ధనాధన్ ఆడిన పంత్.. ఐపీఎల్ 18వ సీజన్ ముందు హాట్ టాపిక్ అవుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నాయకుడిగా సీజన్‌కు రూ.16 కోట్లు ఆర్జించిన పంత్ ఇప్పుడు కొత్త జట్టుకు ఆడడం ఖాయమైంది. ఈసారి అతడు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings )కు ఆడుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. మ్యాచ్ విన్నర్ అయిన పంత్‌ను మెగా వేలంలో కొనేందుకు సీఎస్కేతో పాటు పలు ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. వాటిలో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఒకటి.
కేవలం ఇద్దరినే అట్టిపెట్టుకున్న పంజాబ్ పర్స్‌లో రూ.110.5 కోట్లు ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీ అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్, బ్యాటర్ అవసరం ఎంతో ఉంది. అందుకని పంత్ కోసం ఎంత ధరైనా చెల్లించేందుకు పంజాబ్ వెనుకాడకపోవచ్చు. పైగా.. ఢిల్లీకి కోచ్‌గా వ్యవహరించిన రికీ పాంటింగ్ (Ricky Ponting) ఇప్పుడు పంజాబ్‌కు హెడ్‌కోచ్. అందువల్ల అతడు పంత్‌ను కొనేందుకు యాజమాన్యాన్ని ఒప్పించే వీలుంది.
Rishabh Pant and Ricky ponting Combo In PBKS This Season IPL. 💪💪💪❤️#Rishabhpant #IPLRetention#PBKS
— JassPreet (@JassPreet96) November 1, 2024
ఇక.. 17 సీజన్లలో ఒక్కసారైనా కప్ కొట్టని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) సైతం పంత్ కోసం రేసులో ఉండనుంది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాల్‌లను మాత్రమే రిటరైన్ చేసుకున్న ఆర్సీబీకీ వికెట్ కీపర్ అవసరం ఎంతో ఉంది. అందుకని.. పంత్‌ను పట్టేయాలని బెంగళూరు భావిస్తోంది. పర్స్‌లో రూ.83 కోట్లు ఉండడంతో ఆర్సీబీ అతడికి భారీ ధర పెట్టేందుకు రెడీగా ఉంది.
కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను రిటైన్ చేసుకోని లక్నో సూపర్ జెయింట్స్ కూడా పంత్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. పర్స్‌లో రూ.69 కోట్లు ఉండడంతో వేలంలో గట్టిగానే ప్రయత్నించాలని సంజీవ్ గొయెంకా బృందం అనుకుంటోంది. మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కూడా పంత్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తోంది. వికెట్ కీపర్లు వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్లను వదిలేసిన గుజరాత్ పంత్ కోసం ‘నువ్వానేనా’ అన్నట్టు వేలం పాటలో పాల్గొనే అవకాశముంది.
One player will go to PBKS.
One player will go to RCB.
One player will go to DC.– The Prediction for Rahul, Iyer, Pant. pic.twitter.com/xDjd6MTlsT
— Johns. (@CricCrazyJohns) October 31, 2024
అయితే.. మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా పంత్‌కు వికెట్ కీపింగ్ పగ్గాలు అప్పజెప్పాలనుకుంటున్న సీఎస్కే కూడా తగ్గకపోవచ్చు. ఇప్పటికే ఢిల్లీలో మహీతో పంత్‌ను చూశానని చెప్పిన సురేశ్ రైనా త్వరలోనే ఒకరు పసుపు జెర్సీ వేసుకుంటారని బాంబ్ పేల్చాడు. ఆ వార్తల్లో నిజమెంత? అనేది తెలియాలంటే నవంబర్ 25, 26వ తేదీల వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే అప్పుడేగా మెగా వేలం జరిగేది.