అమరావతి : ఏపీలోని విజయనగరం (Vizianagaram) జిల్లాలో బీసీ హాస్టల్ విద్యార్థి హఠన్మారణం(Student dies) కలకలం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజం గ్రామానికి చెందిన కొణతాల శ్యామలరావు అనే విద్యార్థి విజయనగరం మహారాణి పేట ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటూ 7వ తరగతి చదువుకుంటున్నాడు.
ఆదివారం ఉదయం టిఫిన్ తిన్న తరువాత ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోవడంతో హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు అతడిని ఆటో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు( Doctors) విద్యార్థి మార్గమధ్యలోనే చనిపోయాడని తెలిపారు. పోస్టుమార్టం(Postmartem) రిపోర్టు వస్తే గాని విద్యార్థి మృతికి కారణాలు చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. తమ కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు (Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.