Lucky Bhaskar | లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) సినిమాతో టాలీవుడ్లో హ్యాట్రిక్ అందుకున్నాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఇప్పటికే తెలుగులో మహానటితో పాటు సీతారామం సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నాడు ఈ హీరో. ఇప్పుడు తాజాగా లక్కీ భాస్కర్ అంటూ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గత ఏడాది ‘సార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా సాధించిన విజయంపట్ల మూవీ టీం సక్సెస్ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో కల్కి దర్శకుడు నాగ్ అశ్శిన్తో పాటు, సీతారామం హను రాఘవపూడి వచ్చి సందడి చేశారు.
ఇక ఈ వేడుకలో దుల్కర్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఏర్పడినట్లు తెలిపారు. మలయాళంలో నా సినిమాలకు కూడా రాని కలెక్షన్లు తెలుగులో వస్తున్నాయి. ఒకే బంగారం మూవీ వచ్చినప్పుడు దిల్ రాజు గారు నాకు ఫస్ట్ కాల్ చేసి ఒక రోల్ ఆఫర్ చేశాడు. కానీ నేను అప్పుడు తెలుగుకు బయపడి ఒప్పుకోలేదు. తర్వాత నాగ్ అశ్విన్, స్వప్న దత్ నన్ను కన్విన్స్ చేసి మహానటిలో జెమిని గణేషన్ రోల్ చేయించారు. ఈ పాత్రకు నాకు మంచి గుర్తింపు లభించింది. అనంతరం హనుతో సీతారామం చేశాను. ఇప్పుడు లక్కీ భాస్కర్ రోజురోజుకి తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఏర్పడుతుంది అంటూ దుల్కర్ చెప్పుకోచ్చాడు.
I share a divine connection with the Telugu people.
Dil Raju offered me a role after Ok Bangaram, but I didn’t accept it out of fear that I might mess up. However, Nagi and Swapna convinced me to play Gemini Ganesan in #Mahanati.
– @dulQuer at the #LuckyBaskhar success meet. pic.twitter.com/iOROrojScJ
— Telugu Chitraalu (@TeluguChitraalu) November 3, 2024