NZW vs PAKW | సూపర్ ఓవర్ థ్రిల్లర్.. వన్డేల్లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌కు తొలి విజయం
NZW vs PAKW : పాకిస్థాన్ మహిళల జట్టు వన్డేల్లో న్యూజిలాండ్(Newzealand)పై తొలి విజయం సాధించింది. కివీస్ గడ్డపై జరిగిన మూడో వన్డేలో ఉత్కంఠ రేపిన సూపర్ ఓవర్(Super Over) థ్రిల్లర్‌లో కివీస్‌ను 3 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన...
NZW vs PAKW : పాకిస్థాన్ మహిళల జట్టు వన్డేల్లో న్యూజిలాండ్(Newzealand)పై తొలి విజయం సాధించింది. కివీస్ గడ్డపై జరిగిన మూడో వన్డేలో ఉత్కంఠ రేపిన సూపర్ ఓవర్(Super Over) థ్రిల్లర్‌లో కివీస్‌ను 3 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ వికెట్ నష్టపోకుండా 11 రన్స్ కొట్టింది. అనంతరం న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు మాత్రమే చేసింది. దాంతో, పాకిస్థాన్ వన్డేల్లో కివీస్‌పై డెవినే చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
సూపర్ ఓవర్లో తొలుత పాక్ బ్యాటింగ్ చేసిన పాక్ 11 రన్స్ బాదింది. అమేలియా కేర్ వేసిన తొలి బంతికి అలియా బౌండరీ బాదింది. రెండో బాల్‌కు రన్ రాలేదు. మూడు, నాలుగో బంతికి రెండేసి పరుగులు వచ్చాయి. ఐదో బంతికి సింగిల్, ఆరో బంతికి ఫాతిమా సనా రెండు పరుగులు తీసింది. అనంతరం కివీస్ బ్యాటర్ అమేలియా కేర్.. సదియా ఇక్బాల్ వేసిన రెండో బంతికే ఔటయ్యింది. ఆ తర్వాత డెవినే ఒక సిక్స్ కొట్టింది. ఆఖరి బంతికి డెవినే ఔట్ కావడంతో న్యూజిలాండ్ 8 పరుగులకే పరిమితమైంది.
Pakistan defeat New Zealand for the first time in New Zealand in Women’s ODIs after a Super Over thriller in Christchurch 🙌
The hosts have taken the series 2-1.#PAKvNZ | 📝: https://t.co/73hNQO7qiK pic.twitter.com/GQMUV9W5G6
— ICC (@ICC) December 18, 2023
మొదట ఆడిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 251 రన్స్ కొట్టింది. అమేలియా కేర్(77), మడ్డీ గ్రీన్(65) అర్థ శతకాలతో రాణించారు. భారీ ఛేదనలో పాకిస్థాన్ బ్యాటర్లు బిస్మాహ్ మరూఫ్(68), అలియా రియాజ్(44) దంచికొట్టారు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. స్కోర్లు సమ కావడంతో విజేతను నిర్ణయించేందుకు అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
- Pooja Hegde | మెరిసే డ్రెస్‌లో దిమాక్ ఖరాబ్ చేస్తున్న పూజా హెగ్డే..
- IMD Warning: మధురై, తేని, విరుధానగర్ జిల్లాలకు ఐఎండీ వార్నింగ్
- Jharkhand | జార్ఖండ్‌లో మావోయిస్టుల కాల్పులు.. పోలీసు అధికారికి బుల్లెట్ గాయాలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

