సిద్ధిగా ఆకట్టుకుంటా..
‘ఇందులో నా పాత్ర పేరు సిద్ధి. స్వేచ్ఛగా బతకాలని కోరుకునే అమ్మాయిని. హీరో కేరక్టర్‌కి పూర్తి భిన్నంగా ఉండే పాత్ర. ఈ రెండు పాత్రలు కలిస్తే ఎలా ఉంటుందనేది ఇందులో గమ్మత్తైన అంశం. ఈ పెళ్లి చుట్టూ తిరిగే కథ.. అందరికీ నచ్చేలా ఉంటుంది.’ అని ఫరియా అబ్దుల్లా అన్నారు.
‘ఇందులో నా పాత్ర పేరు సిద్ధి. స్వేచ్ఛగా బతకాలని కోరుకునే అమ్మాయిని. హీరో కేరక్టర్‌కి పూర్తి భిన్నంగా ఉండే పాత్ర. ఈ రెండు పాత్రలు కలిస్తే ఎలా ఉంటుందనేది ఇందులో గమ్మత్తైన అంశం. ఈ పెళ్లి చుట్టూ తిరిగే కథ.. అందరికీ నచ్చేలా ఉంటుంది.’ అని ఫరియా అబ్దుల్లా అన్నారు. అల్లరి నరేశ్‌తో ఆమె జతకట్టిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడు. రాజీవ్ చిలక నిర్మాత. మే 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా మీడియాతో ముచ్చటించింది. ‘ సిద్ధి కూడా నాలాంటి అమ్మాయే. బయట నేను సిద్ధిలాగే ఉంటాను. అందుకే చేయడానికి పెద్ద కష్టపడలేదు. ఇందులో కామెడీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. పరిస్థితుల నుంచే హాస్యం పుడుతుంది. ఇందులోని కంటెంట్ ప్రేక్షకులని సహజంగానే నవ్విస్తుంది.’
అని చెప్పారు ఫరియా అబ్దుల్లా. అల్లరి నరేశ్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవం అనీ, తన కామెడీ టైమింగ్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందని, ఈ సినిమాలో ఆయన కడుపుబ్బ నవ్విస్తారని ఫరియా నమ్మకంగా చెప్పారు. ‘దర్శకుడు మల్లీ తనకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. కథ గురించి అందరితో చర్చిస్తారు. అందరి సలహాలు తీసుకుంటారు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఆయన వర్కింగ్ ైస్టెల్ నాకు నచ్చింది’ అని తెలిపారు ఫరియా. ‘ఒకప్పటికీ ఇప్పటికీ పెళ్లి విషయంలో చాలా మార్పులొచ్చాయి. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో అందరూ కచ్చితంగా ఉంటున్నారు.
మ్యాట్రీమోనీ సైట్స్‌ను ఆశ్రయిస్తూ, ఒకరి గురించి ఒకరికి తెలియకుండానే ఒకటైపోతున్నారు. ఇలాంటి అంశాలతోపాటు పెళ్లికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఇందులో ఉంటాయి.’ అని ఫరియా తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా పేషన్‌తో నిర్మాత రాజీవ్ చిలక ఈ చిత్రాన్ని నిర్మించారని, అలాంటి మంచి నిర్మాత ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆనందంగా ఉందని ఫరియా అన్నారు. ‘మత్తు వదలరా 2’, గోపీ దర్శకత్వంలో ‘భగవంతుడు’ సినిమాలతోపాటు ఓ తమిళ సినిమా కూడా చేస్తున్నట్టు ఫరియా తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

