Jharkhand | జార్ఖండ్‌లో మావోయిస్టుల కాల్పులు.. పోలీసు అధికారికి బుల్లెట్ గాయాలు
Jharkhand | జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసు అధికారికి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Jharkhand | రాంచీ : జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసు అధికారికి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో రంక పోలీసు స్టేషన్ పరిధిలోని డెంగురా గ్రామం వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో రంక పీఎస్ ఇంచార్జి శంకర్ ప్రసాద్ కుష్వాహాకు బుల్లెట్ గాయాలయ్యాయి. శంకర్ ప్రసాద్ కుడి చేతికి తీవ్ర గాయమైందని, ప్రస్తుతం రాంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు జిల్లా ఎస్పీ దీపక్ కుమార్ పాండే తెలిపారు.
ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. పోలీసులపై జార్ఖండ్ జన్ ముక్తి మోర్చాకు సంబంధించిన మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

