Pakistan Spinners : ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ (Pakistan) విజయంతో మురిసిపోయింది. సొంతగడ్డపై 1,348 రోజుల తర్వాత పాక్‌కు ఇది తొలి గెలుపు. తొలి టెస్టులో ఓడిన చోటనే పాక్ అద్భుతం చేస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లకు కళ్లెం వేసింది. స్వదేశంలో 14 వరుస పరాజయాల తర్వాత ఆ జట్టుకు దక్కిన చిరస్మరణీయ విజయమిది. పైగా కెప్టెన్ షాన్ మసూద్‌కు కూడా ఇదే ఫస్ట్ విక్టరీ. పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్లు సాజిద్ ఖాన్ (Sajid Khan), నొమాన్ అలీ (Noman Ali)లు చరిత్ర సృష్టించారు.
రెండు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం వికెట్లు సాజిద్, నొమాన్లే పడగొట్టి రికార్డు బ్రక్ చేశారు. 52 ఏండ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి స్పిన్ ద్వయంగా క్రికెట్ పుస్తకాల్లో చోటు దక్కించుకున్నారు. మొత్తంగా ఈ ఘనత సాధించిన ఏడో స్పిన్నర్ల జోడీగా సాజిద్, నొమన్లు రికార్డుకెక్కారు. 1972లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా బౌలర్లు మస్సీ(16), డెనిస్ లిల్లీలు 20 వికెట్లతో చరిత్ర లిఖించారు. ఆ తర్వాత ఎవరికీ సాధ్యంకాని రికార్డును పాక్ స్పిన్ ద్వయం బద్ధలు కొట్టేసింది.
The first time since 1972 that two bowlers have shared all 20 wickets for their team in a Test match 🤝 pic.twitter.com/BuUwaIcD02
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2024
తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల పరాజయంతో మేల్కొన్న పాక్ సెలెక్టర్లు రెండో మ్యాచ్‌కు బలమైన జట్టును దింపారు. స్పిన్ ట్రాక్ సిద్దం చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ తీయాలనుకున్న పాక్ వ్యూహం ఫలించింది. స్పిన్ ద్వయం సాజిద్ ఖాన్, నొమన్ అలీల విజృంభణ ఇంగ్లీష్ బ్యాటర్లు మేము ఆడలేమంటూ చేతులెత్తేశారు.
SAJID AND NOMAN SPIN PAKISTAN TO THEIR FIRST TEST WIN AT HOME SINCE FEBRUARY 2021! 🇵🇰 pic.twitter.com/y2nGHTOo7K
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2024
తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో చెలరేగిన సాజిద్ ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. నొమన్ సైతం (3/101)తో ఓ చేయి వేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ఈ ఇద్దరూ తిప్పేశారు. సాజిద్ 2, నొమన్ 8 వికెట్లు తీయడంతో పర్యాటక జట్టుకు ఓటమి తప్పలేదు. 152 పరుగుల తేడాతో గెలుపొందని పాక్ మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.