IND vs NZ 1st Test : తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ధాటిగా మొదలెట్టింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(35) స్టంపౌట్ అయ్యాక రోహిత్ శర్మ(52) జోరు పెంచాడు. తొలి ఇన్నింగ్స్‌లో హడెలెత్తించిన మ్యాట్ హెన్రీ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదేసి అర్ధ శతకం సాధించాడు. అయితే.. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో బంతిని డిఫెండ్ చేసినప్పటికీ అది వికెట్లను గిరాటేసింది. అంతే.. 95 వద్ద రెండో వికెట్ పడింది. సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ(6) ఆచితూచి ఆడుతున్నాడు. 22 ఓవర్లకు భారత జట్టు స్కోర్.. 95/2.
కివీ బౌలర్లను ఉతికేస్తూ బౌండరీల మోత మోగించారు. దాంతో, స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తొలి ఇన్నింగ్స్ హీరోలు మ్యాట్ హెన్రీ, విలియం ఓ రూర్కీల ఓవర్లో భారీ షాట్లు ఆడిన యశస్వీ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. అజాజ్ పటేల్ విసిరిన తొలి బంతిని ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడబోయిన అతడు స్టంపౌట్ అయ్యాడు. దాంతో, 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
The Chinnaswamy goes silent after Rohit Sharma, having played a forward defence to Ajaz Patel, watches the ball go on to disturb the stumps https://t.co/tzXZHnJPJI #INDvNZ pic.twitter.com/egxXcrBu2U
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2024
చిన్నస్వామి స్టేడియంలో మూడో రోజు న్యూజిలాండ్ యువకెరటం రచిన్ రవీంద్ర(134) శతకంతో గర్జించాడు. మాజీ సారథి టిమ్ సౌథీ(65) మెరుపు హాఫ్ సెంచరీతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అంతకుముందు ఓపెనర్ డెవాన్ కాన్వే(91) సైతం అర్ధ శతకం బాదగా.. న్యూజిలాండ్ 402 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/72), కుల్దీప్ యాదవ్(3/99)లు రాణించారు.
A fantastic knock from Rachin Ravindra comes to an end with New Zealand taking a huge first-innings lead of 356 👏
Can India save this Test? https://t.co/tzXZHnJhUa #INDvNZ pic.twitter.com/9Niicpk2Au
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2024
తొలి ఇన్నింగ్స్‌లో మ్యాట్ హెన్రీ(5/15), విలియం ఓ రూర్కీ(4/22)లు చెలరేగడంతో టీమిండియా 46 పరుగులకే పరిమితమై చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాపై పెర్త్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత్.. స్వదేశంలో ఇంత తక్కువ స్కోర్‌కే కుప్పకూలడం ఇదే మొదటిసారి.