Jani Master – Anee Master | లైంగిక వేధింపుల కేసులో (sexual assault case) టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Maste) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఓ లేడి డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జానీపై ఆరోపణలు రాగా అతడిపై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసులు నమోదు అయ్యాయి. అయితే ప్రస్తుతం బెయిల్ మీదా బయటకు వచ్చిన జానీ మాస్టర్ విషయంపై తాజాగా ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ స్పందించింది.
ఆనీ మాస్టర్ మాట్లాడుతూ.. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసి ఇప్పటికి నేను షాక్‌లో ఉన్నాను. జానీ మాస్టర్‌తో కలిసి రెండేళ్లు పని చేశా. నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. జానీ చాలా మంచి వ్యక్తి. ఎంతో మంది డ్యాన్సర్లకు సాయం చేశారు. అయితే నేను ఇన్నిరోజులు కలిసి పనిచేసిన మాస్టర్ ఇలా చేశాడా అంటే నమ్మబుద్ది కావడం లేదు. నేను కూడా అందరిలాగే టీవీలోనే చూసి తెలుసుకున్నాను. అయితే ఇది అమ్మాయి విషయం కాబట్టి ఇప్పుడు ఎవరూ కూడా స్పందించట్లేదు. ఒకవేళ బాధితురాలికి నిజంగా అన్యాయం జరిగితే ఆమె తరపున మద్దతుగా నిలబడతాను. అంటూ ఆనీ మాస్టర్ చెప్పుకోచ్చింది.