PAK vs ENG 1st Test : సొంతగడ్డపై పాకిస్థాన్‌కు మరో టెస్టు ఓటమి ఎదురవ్వనుంది. ఈమధ్యే బంగ్లాదేశ్ (Bangladesh) చేతిలో చిత్తుగా ఓడి సిరీస్ సమర్పించుకున్న పాక్.. ముల్తాన్‌లో ఇంగ్లండ్ (England) దెబ్బకు తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సగానికిపైగా వికెట్లు కోల్పోయింది. హ్యారీ బ్రూక్(317), జో రూట్(262)ల విధ్వంసక బ్యాటింగ్‌కు గస్ అట్కిన్సన్(2/28), బ్రౌడన్ చేజ్(2/39)ల జోరు తోడవ్వడంతో పాకిస్థాన్ కుదేలైంది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి సెంచరీ హీరో అఘా సల్మాన్(41), అమర్ జమాల్(27)లు క్రీజులో ఉన్నారు. ఇంకా 115 పరుగులు వెనకే ఉన్న పాక్.. ఆఖరి రోజు తొలి సెషన్లో మరో రెండు వికెట్లు కోల్పోయిందంటే ఓటమి పాలవ్వడం పక్కా.
ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపు వాకిట నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో మాజీ సారథి జో రూట్(262 : 375 బంతుల్లో 17 ఫోర్లు).. హ్యారీ బ్రూక్(317: 322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్సర్లు)లు విధ్వంసంతో భారీ స్కోర్ కొట్టింది. 823-7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి పాక్‌ను రెండో ఇన్నింగ్స్‌కు ఆహ్వానించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తడబడింది.
Salman and Jamal dig in, but another third-innings calamity has Pakistan staring at defeat in Multanhttps://t.co/jamBKcZQ6G | #PAKvENG pic.twitter.com/bPOicr0RUZ
— ESPNcricinfo (@ESPNcricinfo) October 10, 2024
తొలి బంతికే క్రిస్ వోక్స్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(0)ను బౌల్డ్ చేయగా.. అట్కిన్సన్ తన పేస్‌తో షాన్ మసూద్(25)ను బోల్తా కొట్టించాడు. ఇక మాజీ సారథి బాబర్ ఆజాం(5) మరోసారి నిరాశపరచగా.. క్రీజులో కుదురుకున్న సాద్ షకీల్(29)ను జాక్ లీచ్ పెవిలియన్ పంపాడు.
BABAR OUT FOR 5!
His 18th consecutive Test innings without reaching fifty 😱 #PAKvENG pic.twitter.com/A7xLB4R1nG
— ESPNcricinfo (@ESPNcricinfo) October 10, 2024
82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పాక్‌ను అఘా సల్మాన్(41), అమర్ జమాల్(27)లు ఆదుకున్నారు. దాంతో, నాలుగో రోజు ఆట ముగిసే సరికి పాక్ 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసిందందే. ఈ ఇద్దరు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో ఫలితం కోసం ఇంగ్లండ్ ఎదురు చూడాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాన్ మసూద్(151), అబ్దుల్లా షఫీక్(102), అఘా సల్మాన్(104)ల శతకమోతతో పాక్ 556 పరుగులకు ఆలౌటయ్యింది.