Womens T20 World Cup : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ రేసులో వెనుకబడిన పాకిస్థాన్ (Pakistan)కు పెద్ద షాక్. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌కు కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana) దూరం కానుంది. పేస్ ఆల్‌రౌండర్ అయిన సనా మెగా టోర్నీ మధ్యలోనే స్వదేశం వెళ్లనుంది. ఇంత అర్థాంతరంగా పాక్ సారథి పాక్‌కు వెళ్లడానికి కారణం ఏంటంటే? .. ఆమె తండ్రి సనాహుల్లా (Sanaullah) చనిపోయారు. దాంతో, ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కరాచీ వెళ్లనుంది.
పితృ వియోగంతో పుట్టుడు శోకంలో మునిగిపోయిన సనాకు పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) సంతాపం తెలిపాడు. ఆసీస్‌తో అక్టోబర్ 11న జరిగే మ్యాచ్‌కు సనా దూరం కానున్న నేపథ్యంలో స్థానంలో వైస్ కెప్టెన్ మునీబా అలీ (Muneeba Ali) సారథిగా వ్యవహరించనుంది.
إِنَّا لِلَّٰهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ
Indeed! To Allah we belong and to Him we shall return
Huge loss!Kindly say a prayer for Fatima Sana’s Father, Sanaullah.
He passed away while Fatima was at national duty at the World Cup. Keep her and her family in your prayers.… pic.twitter.com/Z73meAXJM2— Sana Mir ثناء میر (@mir_sana05) October 10, 2024
వరల్డ్ కప్‌లో శ్రీలంకపై ఉత్కంఠ విజయంతో బోణీ కొట్టిన పాకిస్థాన్ తదుపరి పోరులో భారత్ చేతిలో కంగుతిన్నది. స్వల్ప ఛేదనలో ఫాతిమా సనా తన పేస్‌తో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించింది. 18వ ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసి.. భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది.
Fatima Sana 🤝 Naseem Shah
Both tried their best but ended up on the losing side 💔 pic.twitter.com/4OBONQUrah
— Team Green 🏏🇵🇰 (@_TeamGreen123) October 6, 2024
అయితే.. హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన బ్యాటింగ్‌తో ఇండియా జయకేతనం ఎగుర వేసింది. దాంతో.. సెమీస్ రేసులో పాక్ వెనకబడింది. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 11, శుక్రవారం జరిగే మ్యాచ్‌లో రెండు విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియాను పాక్ ఢీకొట్టనుంది. చావోరేవో లాంటి ఈ మ్యాచ్‌కు కెప్టెన్ ఫాతిమా సనా దూరమవ్వడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే.