Union Govt | కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాటా నిధులను విడుదల చేసింది. రూ.1,78,173కోట్ల పన్ను వాటాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నది. నిధులు రాష్ట్రాల అభివృద్ధి, మూల ధన వ్యయానికి ఊతమిస్తాయని కేంద్రం భావిస్తున్నది. కేంద్రం ముందస్తు వాటా రూ.89,086.50కోట్లతో కలిపి రూ.1,78,173కోట్లు విడుదల చేసినట్లు ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిసింది. తెలంగాణకు పన్నుల వాటా రూపంలో రూ.3,745కోట్ల దక్కనున్నాయి. ఇక ఏపీకి రూ.7,211 కోట్లు విడుదలయ్యాయి. అయితే, అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.31,962 కోట్ల మేరకు కేంద్రం పన్నుల్లో వాటాను కేటాయించింది. ఆ తర్వాత బిహార్‌కు రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.13,987 కోట్లు, మహారాష్ట్రకు రూ.11,255 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.13,404 కోట్లు, రాజస్థాన్ కు రూ.10,737 కోట్లు, ఒడిశాకు రూ.8,068 కోట్లు వాటా దక్కింది.