AUS vs PAK 2nd T20 : ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన పాకిస్థాన్ (Pakistan)కు టీ20ల్లో వరుసగా రెండో ఓటమి ఎదురైంది. సిడ్నీ మైదానంలో యువపేసర్ స్పెన్సర్ జాన్సన్(5/26) నిప్పులు చెరగడంతో ఆసీస్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వల్ప ఛేదనలో జాన్సన్ పాక్ నడ్డివిరిచాడు. ఓవైపు అందరూ డగౌట్‌కు క్యూ కడుతున్నా ఉస్మాన్ ఖాన్(52) ఒక్కడే అర్ధ శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. అతడిని కూడా పెవిలియన్ పంపిన జాన్సన్ ఆస్ట్రేలియా సిరీస్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.
స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో అదరగొడుతోంది. గబ్బా మైదానంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మెరుపులతో జయకేతనం ఎగురువేసిన ఆసీస్ రెండో టీ20లోనూ అదే జోరు చూపింది. ప్రత్యర్థిపై 13 పరుగుల విజయంతో సిరీస్‌లో రెండడుగులు ముందుకేసింది. మొదట ఓపెనర్లు మాథ్యూ షార్ట్(32), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(20) లు పాక్ పేసర్లకు దడ పుట్టిస్తూ 3.4 ఓవర్లోనే 54 పరుగులు జోడించారు.
Vintage Pakistan 🇵🇰 back on Track 🛤️
T20 Series :
1st T20 – AUS win by 29 Runs
2nd T20 – AUS win by 13 Runs👉🏻 Pakistan can’t even beat Australia even when Cummins, Head, Marsh, Starc, Hazelwood were not in the Team 😯#AUSvsPAK pic.twitter.com/5QjUkTw65D
— Richard Kettleborough (@RichKettle07) November 16, 2024
దంచికొడుతున్న ఈ జంటను విడదీసిన హ్యారిస్ రవుఫ్(4/22) పాక్‌కు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత సుఫీయన్, అబ్బాస్ అఫ్రిదిలు కూడా చెలరేగగా ఆసీస్ కష్టాల్లో పడింది. గత మ్యాచ్ హీరో గ్లెన్ మ్యాక్స్‌వెల్(21) ధనాధన్ ఆడలేకపోయాడు. ఆఖర్లో అరోన్ హర్డీ(28), టిమ్ డేవిడ్(18)లు బ్యాట్ ఝులిపించగా ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.
Irfan Khan sent a few jitters, but Nathan Ellis stayed cool for an anticlimactic end 🇦🇺
Scorecard: https://t.co/LA5xJrxsV2 | #AUSvPAK pic.twitter.com/UXtJ5JEZGX
— ESPNcricinfo (@ESPNcricinfo) November 16, 2024
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మాజీ సారథి బాబర్ ఆజాం(3)ను గ్జావియర్ బార్ట్లెట్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత స్పెన్సర్ జాన్సన్(5/26) తన ప్రతాపం చూపిస్తూ టాపార్డర్ పని పట్టాడు. అయితే.. ఉస్మాన్ ఖాన్(52) హాఫ్ సెంచరీతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ, జాన్సన్‌కు తోడుగా ఆడం జంపా(2/19) విజృంభించగా మిగతావాళ్ల నుంచి అతడికి సహకారం అందలేదు. దాంతో, పాక్ విజయం వాకిట బొక్కబోర్లాపడింది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో టీ20 నవంబర్ 18న హోబర్ట్‌లో జరుగనుంది.