MS Dhoni | ధోనీ జెర్సీ నంబర్‌తో ప్రత్యేక నాణెం.. ఆర్బీఐ కీలక ప్రకటన..?
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వార్త ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. అతడి జెర్సీ నంబర్ 7తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రత్యేక నాణేన్ని విడుదల చేయనుందనే వార్తలు తెగ తిరుగుతున్నాయి.
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వార్త ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి పెట్టిన మహీ భాయ్ గౌరవార్థం.. అతడి జెర్సీ నంబర్ 7తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రత్యేక నాణేన్ని విడుదల చేయనుందనే వార్తలు తెగ తిరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అప్రతమత్తమైన రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఆర్థిక వ్యవహారాల విభాగం ధోనీ జెర్సీ నంబర్ 7తో నాణేన్ని విడుదల చేయడం లేదని.. మీడియాలో ప్రచారమవుతున్న వార్తలన్నీ అవాస్తమని తేల్చి చెప్పింది.
An image circulating on social media claims that a new ₹7 coin will be released to honor Mahendra Singh Dhoni for his contributions to Indian Cricket.#PIBFactCheck
✔️ The claim made in the image is #fake.
✔️ The Department of Economic Affairs has made NO such announcement. pic.twitter.com/rgFwmVUPbL
— PIB Fact Check (@PIBFactCheck) November 14, 2024
అన్క్యాప్డ్ ప్లేయర్‌గా
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)ను ఐదుసార్లు విజేతగా నిలిపిన మహీ భాయ్ 17వ సీజన్లో పగ్గాలు వదిలేశాడు. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad)ను ప్రకటించి హుందాగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దాంతో, అతడు ఐపీఎల్ 18వ సీజన్లో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడబోతున్నాడు. సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మహీని రూ.4 కోట్లకు అట్టిపెట్టుకుంది.

పదిహేడో సీజన్లో ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ రూ.12 కోట్లు ముట్టజెప్పింది. కానీ, ఇప్పుడు ధోనీ అన్క్యాప్డ్గా బరిలోకి దిగనున్నాడు. దాంతో, అతడి ఆదాయంలో రూ. 8 కోట్లు కోత పడనుంది. అన్‌క్యాప్ట్ ప్లేయర్ ఎవరైనా సరే వాళ్లకు రూ. 4 కోట్లు మాత్రమే ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో జరుగబోయే మెగా వేలంలో మ్యాచ్ విన్నర్లను కొనేందుకు సీఎస్కే యాజమాన్యం సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి
- Kartika Brahmotsavam | ఈనెల 28 నుంచి పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
- Protesters Attack Ministers Houses | మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై.. నిరసనకారులు దాడి
- Redmi A4 5G | రెడ్మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్ రెడ్మీ ఏ4 5జీ.. 20న మార్కెట్లో ఆవిష్కరణ..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

