తిరుపతి : తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (Kartika Brahmotsavam ) ఈనెల 28 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించనున్నామని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడుకు (Chairman BR Naidu) ఈవో శ్యామల రావు ఆహ్వానపత్రికను అందజేశారు.
పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చైర్మన్కు వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వి.వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న స్వామివారిని 61,613 మంది భక్తులు దర్శించుకోగా 20,291 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.12 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.