Viral News | పెళ్లి విషయంలో గొడవ జరగడంతో క్షణికావేశంలో తన ప్రియురాలిని చంపేశాడో ప్రియుడు. కోపం చల్లారాక తన ప్రియురాలితో మాట్లాడాలని భావించి, తన ఆత్మను పిలవాలని అనుకున్నాడు. తనకు తాంత్రిక విద్యలు రాకపోయినప్పటికీ.. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తే ప్రియురాలి ఆత్మను పిలిచేందుకు యత్నించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌లోని ద్వారకపూరి ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఫిబ్రవరి 13వ తేదీన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు.. ఫ్లాట్ తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా నగ్నంగా బెడ్‌పై పడి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించారు. మెడ చుట్టూ తాడుతో బిగించినట్లుగా ముద్రలు కనిపించాయి. దీంతో యువతిని గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. యువతి హత్యకు ముందు ఆమెపై లైంగిక దాడి చేశాడని.. ఆ తర్వాత తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి గొంతు నులిమి చంపేసినట్లుగా అనుమానిస్తున్నారు.
మరోవైపు యువతి తండ్రి తన కూతురు కనిపించడం లేదని ఫిబ్రవరి 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలంటే.. ఫిబ్రవరి 10వ తేదీన ఆమెను ఇండోర్ కలెక్టరేట్ సమీపంలో దింపి వెళ్లానని ఆమె తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇంటికి రాలేదని తెలిపారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఫోన్ నుంచి ” నాన్నకు చెప్పండి.. నేను ఇంటికి రాను” అని ఓ మెసేజ్ కుటుంబసభ్యులకు వచ్చింది.. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ అయ్యిందని చెప్పారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ద్వారకపూరి ప్రాంతంలో ఆమె మృతదేహం కనిపించింది.
కాగా, మృతదేహం లభించిన ఫ్లాట్‌ను యువతితో కలిసి చదువుకున్న పీయూష్ ధామ్మోడియా అని యువకుడిదిగా పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ముంబైలో అతన్ని పట్టుకున్నారు. పీయూష్‌ను విచారించగా.. వాళ్లిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని పేర్కొన్నాడు. ఈ క్రమంలో రీసెంట్గా గొడవ జరగడంతో క్షణికావేశంలో చంపేశానని.. అనంతరం భయంతో ఇండోర్ నుంచి పారిపోయినట్లుగా చెప్పాడు.
హత్య అనంతరం భయంతో నిందితుడు మహారాష్ట్రలోని పన్వేల్‌కు వెళ్లి హోటల్లో గది అద్దెకు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం తన ప్రియురాలితో మాట్లాడేందుకు ఆత్మను పిలవాలని అతను ప్రయత్నించాడని పేర్కొన్నారు. ఇందుకోసం యూట్యూబల్లో ఆత్మలను పిలిచే విధానాలపై వీడియోలు చూసి, ప్రయత్నించినట్లుగా తెలిసింది.
కాగా, యువతి ఇతరులతో మాట్లాడుతున్నదని పీయూష్ అనుమానించేవాడని.. దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. ఇద్దరి వ్యక్తిగత వీడియోలు కాలేజీ వాట్సాప్ గ్రూప్‌ల్లో షేర్ అయ్యాయని.. యువతి వాట్సాప్ స్టేటస్‌గా కూడా వీడియోలను అప్లోడ్ చేసినట్లుగా గుర్తించారు. దీనిపై ఇండోర్ డీసీపీ కృష్ణలాల్ చందానీ మాట్లాడుతూ.. నిందితుడిని ముంబైలో అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని తెలిపారు. వారి పెళ్లిపై ఇరు కుటుంబాలు అభ్యంతరాలు తెలపడంతో పాటు, యువతిపై పీయూష్ అనమానం పెంచుకోవడంతో తరచూ గొడవలు జరిగేవని.. వాటివల్లే హత్య చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, సీసీటీవీ ఫుటేజీ, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.