KCR Birthday | ఒమన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కొండేటి దేవేందర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమేనా అనే అనుమానాల మధ్య.. ఒక్కడంటే ఒక్కడే తెలంగాణ వస్తది, అది బంగారు తెలంగాణగా మారుతదని నమ్మాడని.. ఆ వ్యక్తే కేసీఆర్ అని అన్నారు. ఉక్కు సంకల్పం కలిగిన ఆ ఒక్కడే.. కేసీఆర్! ఉద్యమాల తెలంగాణను పదేళ్లలోనే ఉజ్వల తెలంగాణగా మార్చి, దేశానికే తలమానికంగా నిలిపిన ధీరుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
కాగా, కేసీఆర్ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ నేతలు స్వామి, మొయిజ్, రవి, రవితేజ, సాయి, ప్రణీత్, శ్రీధర్ పాల్గొన్నారు.