Redmi A4 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) అనుబంధ రెడ్మీ (Redmi) తన రెడ్మీ ఏ4 5జీ (Redmi A4 5G) ఫోన్ను ఈ నెల 20న ఆవిష్కరించనున్నది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 మొబైల్ ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపు ఉండనున్నది. గత నెలలో జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఈవెంట్లో రెడ్మీ తన రెడ్మీ ఏ4 5జీ ఫోన్ను ఆవిష్కరించింది.
తన రెడ్మీ ఏ4 5జీ (Redmi A4 5G) ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 మొబైల్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతోపాటు 5160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతో 6.88 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా ఉంటది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ బేస్డ్ హైపర్ ఓఎస్ స్కిన్ వర్షన్ మీద పని చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. శాండ్ విచ్ డిజైన్, డ్యుయల్ టోన్ గ్లాస్ ఫినిష్తో వస్తోంది.
భారత్ మార్కెట్లో రెడ్ మీ ఏ4 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10 వేల లోపు ధరకే లభిస్తుందని షియోమీ ధృవీకరించింది. బ్యాంకు, లాంచింగ్ ఆఫర్లతో కలిసి ఫోన్ రూ.8,499లకే లభిస్తుందని తెలుస్తోంది.